పాకిస్థాన్‌లో ప్రేమికుల రోజు నిషేధం

Mon,February 13, 2017 06:29 PM

Islamabad High Court prohibits Valentines Day celebrations

ఇస్లామాబాద్ : పాకిస్థాన్ ప్రేమికులకు ఇది చేదు వార్తే. ప్రేమికుల రోజును నిషేధిస్తూ ఇస్లామాబాద్ హైకోర్టు ఇవాళ తీర్పునిచ్చింది. ప్రేమికుల రోజును నిషేధించాలంటూ పాక్ సినీయర్ సిటిజన్ అబ్దుల్ వహీద్ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు విచారణకు స్వీకరించింది. వాలెంటైన్స్ డే ముస్లిం సంప్రదాయంలో భాగం కాదని వహీద్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. పిటిషన్‌లో వహీద్ పేర్కొన్న అంశాలను కోర్టు ఏకీభవించింది. విచారణ అనంతరం ప్రేమికుల రోజును పాకిస్థాన్‌లో నిషేధిస్తున్నట్లు కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రేమికుల రోజుకు సంబంధించిన అంశాలను సామాజిక మాధ్యమాలలో ప్రచారం చేయొద్దని కోర్టు ఆదేశించింది. అదే విధంగా ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా కూడా వాలెంటైన్స్ డేకు సంబంధించిన ప్రమోషన్లను ఆపాలని ఆదేశాలు జారీ చేసింది కోర్టు.

1565
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles