అభినందన్‌ను విడుదల చేయొద్దంటూ దాఖలైన పిటిషన్ కొట్టివేత

Fri,March 1, 2019 04:22 PM

Islamabad High Court Dismisses Petition to Stop IAF Wing Commander Release

ఇస్లామాబాద్ : భారత వింగ్ కమాండర్ విక్రం అభినందన్‌ను విడుదల చేయొద్దంటూ ఇవాళ మధ్యాహ్నం ఇస్లామాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌పై తక్షణమే విచారణ చేపట్టి అభినందన్ విడుదలను ఆపాలని ఓ పాకిస్థానీ కోర్టును ఆశ్రయించాడు. భారత పైలట్ పాకిస్థాన్‌ను వ్యతిరేకంగా పని చేసి నేరానికి పాల్పడ్డాడని, అతడిపై విచారణ జరగాలని పిటిషన్‌లో పేర్కొన్నాడు. అయితే ఈ పిటిషన్‌ను విచారించేందుకు కోర్టు నిరాకరించింది. పాకిస్థానీ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. దీంతో పాక్ ఆర్మీ కస్టడీలో ఉన్న అభినందన్ విడుదలకు మార్గం సుగమమైంది. నిన్న పాకిస్థాన్ పార్లమెంట్‌లో ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ.. భారత పైలట్ విక్రం అభినందన్‌ను ఇవాళ విడుదల చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే.

2467
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles