లిబియా చముర క్షేత్రాలపై ఐసిస్ దాడులు

Thu,January 21, 2016 02:51 PM

ISIS Targets Oil Refineries In Libya

రాస్ లాన్ఫ్ : ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు లిబియాలో భారీ విధ్వంసం సృష్టించారు. పోర్టు నగరమైన రాస్ లాన్ఫ్‌లో ఇంధన క్షేత్రాలపై దాడులు చేశారు. ఆయిల్ పైప్‌లైన్లతో పాటు ముడిచమురు ట్యాంకర్లకు నిప్పుపెట్టారు. దాంతో ఆ ప్రాంతమంతా దట్టమైన నల్లటి పొగతో కమ్ముకుపోయింది. గత కొన్ని రోజులుగా ఐసిస్ ఉగ్రవాదులు లిబియా తీర ప్రాంతంలో భీకర స్థాయిలో విధ్వంసం సృష్టిస్తున్నారు. దాడులు జరుగుతాయన్న సంకేతాలు రావడంతో ఆ దేశ జాతీయ ఇంధన సంస్థ తన రిఫైనరీల్లో ఉన్న ట్యాంకర్లను ఖాళీ చేయించింది. నాలుగేళ్ల క్రితం నియంత గడాఫీని తొలిగించిన తర్వాత ఆ దేశంలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు తమ ప్రాబల్యాన్ని పెంచుకున్నారు.

1851
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles