బ్రిట‌న్ ట్యాంక‌ర్‌ను అడ్డుకున్న ఇరాన్ నౌక‌లు

Thu,July 11, 2019 01:09 PM

Iranian boats tried to intercept British tanker in Gulf waters

హైద‌రాబాద్‌: గ‌ల్ఫ్ తీరంలో బ్రిటీష్ ఆయిల్ ట్యాంక‌ర్ నౌక‌ను.. ఇరాన్‌కు చెందిన నౌక‌లు వెంటాడాయి. అయితే ఇరాన్ నౌక‌ల‌ను బ్రిటన్ రాయ‌ల్ నేవీ త‌రిమికొట్టింది. ఇటీవ‌ల హార్ముజ్ జ‌ల‌సంధిలో విదేశీ నౌక‌ల‌పై ఇరాన్ దాడి చేస్తున్న విష‌యం తెలిసిందే. హెచ్ఎంఎస్ మాన్‌ట్రోజ్‌, బ్రిటీష్ హెర్మిటేజ్‌కు ర‌క్ష‌ణ‌గా మూడు నౌక‌లు వెళ్లాయి. అయితే ఇరాన్ నౌక‌ల‌కు బెదిరింపు ఇవ్వ‌డంతో అవి త‌ప్పుకున్నాయి. అంత‌ర్జాతీయ చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా ఇరాన్ వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని బ్రిట‌న్ ఆరోపిస్తున్న‌ది. ఇస్లామిక్ రెవ‌ల్యూష‌న్ గార్డ్ కార్ప్స్‌కు చెందిన నౌక‌లు బ్రిటన్ ట్యాంక‌ర్‌ను అడ్డుకున్నాయి.

1966
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles