ఇన్‌విజిబుల్ బాక్స్ ఛాలెంజ్ చేస్తారా?..వీడియో

Wed,December 6, 2017 04:38 PM

Invisible Box Challenge Goes viral on Social media

సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక ఫన్నీ ఛాలెంజ్ సందడి చేస్తున్న విషయం తెలిసిందే. ఐస్ బకెట్‌ఛాలెంజ్, బాటిల్ ఫ్లిప్ ఛాలెంజ్, సిన్నామోన్ ఛాలెంజ్ ఫన్నీగా సాగుతూ సందడి చేశాయి. అయితే తాజాగా సరికొ్త్త ఛాలెంజ్ పై నెటిజన్లు ఆసక్తి చూపుతున్నారు. అదే ఇన్‌విజిబుల్ బాక్స్ ఛాలెంజ్..అంటే మన ముందు ఓ బాక్సు ఉందని ఊహించుకుని దానిపై కాలు పెట్టి పైకి ఎక్కడం అన్నమాట. సరిగ్గా చెప్పాలంటే గాలిలో కాలు పెట్టి భూమి మీద తాకకుండా పైకి ఎక్కాలి. అయితే ఇన్‌విజిబుల్ బాక్స్ ఛాలెంజ్‌లో పాల్గొని సక్సెస్ అవుతున్నవారు కొందరైతే..కింద పడి దెబ్బలు తగిలించుకున్నవారు మరికొందరు. ఇన్‌విజిబుల్ ఛాలెంజ్‌కు సంబంధించిన కొన్ని వీడియోలపై మీరూ ఓ లుక్కేయండీ మరీ..!

1823
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles