
ప్రపంచ పోలీసు సంస్థ పేరు ఇంటర్‌పోల్. ఇంటర్నేషనల్ పోలీసుకు అది హ్రస్వరూపం. ఆ సంస్థకు ప్రస్తుతం ఓ చైనీయుడు అధ్యక్షుడుగా ఉన్నారు. (నిజానికి ఉండేవారని చెప్పుకోవాలి.) ఆయన పేరు మెంగ్ హోంగ్వెయ్. ఇంటర్‌పోల్ ప్రధాన కార్యాలయం ఫ్రాన్స్‌లోని ...... నగరంలో ఉంటుంది. మెంగ్ అక్కడే బాధ్యతలు నిర్వహించేవారు. ఇటీవల ఆయన స్వదేశమైన చైనా వెళ్లినట్టు తెలిసింది. చైనాలో ఆయన ఆచూకీ గల్లంతైంది. ఫ్రాన్స్‌లో లేరు. చైనాలో కనిపించడం లేదు.. అంటే ఇందులో ఏదో మతలబు ఉందని పుకూర్లు వ్యాపించాయి. నెలరోజుల తర్వాత ఇటీవల ఆయన భార్య ఫ్రెంచ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంటర్‌పోల్ అద్యక్షునికే గతిలేకుండా పోతే ఎలా అని ప్రపంచవ్యాప్తంగా దిగ్భ్రాంతి వ్యక్తమైంది. కానీ ఈ చిక్కుముడి ఎట్టకేలకు విడిపోయింది. ఆదివారం మెంగ్ పేరిట రాజీనామా లేఖ ఇంటర్‌పోల్ కార్యాలయానికి అందింది. దానిని వెంటనే అమలు చేయాలని విజ్ఞప్తి కూడా అందులో ఉంది. ఇదిలాఉండగా ఆయన ముడుపులు తీసుకున్నారని, చట్టాలు ఉల్లంఘించినట్టు ఆరోపణలు ఉన్నాయని చైనా ప్రజాభద్రతా మంత్రిత్వశాఖ (మన హోంశాఖ లాంటిది) సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. అంటే ఇప్పుడాయన చైనా అధికారుల నిర్బంధంలో ఉన్నారన్నమాట. చైనా ప్రభుత్వం పెద్దఎత్తున అవినీతి వ్యతిరేక చర్యలు చేపడుతున్న సంగతి తెలిసిందే.