అర్జున్ టెండూల్కర్ ఎవరిలా ఉంటాడో తెలుసా?

Thu,September 29, 2016 12:54 PM

Internet Calls Sachins Son Arjun Tendulkar Indian Justin Bieber

ముంబై: ప‌్ర‌పంచంలో వ్య‌క్తుల‌ను పోలిన వ్య‌క్తులు ఏడుగురు ఉంటార‌ని అంటుంటారు. అందులో పెద్ద ఆశ్చ‌ర్యం ఏమీ లేదు. కానీ ఓ దేశ సెల‌బ్రిటీ మ‌రో దేశ సెల‌బ్రిటీలాగా ఉంటే అది క‌చ్చితంగా ఆశ్చ‌ర్య‌మే. కెన‌డియ‌న్ పాప్ సింగ‌ర్ జ‌స్టిన్ బైబ‌ర్ గురించి మీకు తెలుసు క‌దా.. అచ్చూ అత‌న్ని పోలిన మ‌రో వ్య‌క్తి ఇండియాలోనూ ఉన్నాడు. అత‌ను కూడా సాధార‌ణ వ్య‌క్తేమీ కాదు.. మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ స‌చిన్ టెండూల్క‌ర్ త‌న‌యుడు అర్జున్ టెండూల్క‌ర్‌. మొన్న సెప్టెంబ‌ర్ 24న అర్జున్ త‌న 17వ పుట్టిన‌రోజు జ‌రుపుకున్నాడు. ఈ ఫొటోను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసి విష్ చేయాల్సిందిగా స‌చిన్ కోరాడు. కానీ అభిమానులు మాత్రం అత‌నికి విష్ చేయ‌డం మానేసి.. అత‌నిలో కొత్త‌గా మ‌రో వ్య‌క్తిని గుర్తించారు. అర్జున్ అచ్చూ పాప్ స్టార్ జ‌స్టిన్ బైబ‌ర్‌లాగే ఉన్నాడంటూ ఓ వ్య‌క్తి ఇద్ద‌రి ఫొటోల‌ను పోస్ట్ చేయ‌డంతో అది కాస్తా వైర‌ల్‌గా మారిపోయింది. జ‌స్టిన్‌.. అర్జున్‌కు ట్విన్ బ్ర‌ద‌ర్ అని కొంద‌రంటే.. మ‌రికొంద‌రు అర్జున్‌ను ఇండియ‌న్ బైబ‌ర్‌గా అభివ‌ర్ణించారు.

3619
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles