ట్రంప్‌పై ఇంటలిజెన్స్ మాజీ చీఫ్‌ల తిరుగుబాటు

Sat,August 18, 2018 04:22 PM

intelligence ex chiefs revolt against trump

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై మాజీ ఇంటలిజెన్స్ అధికారులు ధ్వజమెత్తారు. ప్రభుత్వ వ్యతిరేక వ్యాఖ్యలు చేసినందుకు సీఐఏ మాజీ చీఫ్ జాన్ బ్రెన్నాన్ సెక్యూరిటీ క్లియరెన్స్ రద్దు చేస్తూ ట్రంప్ జారీచేసిన ఉత్తర్వులపై వారు మండిపడుతున్నారు. సెక్యూరిటీ క్లియరెన్స్ రద్దు చేస్తే ప్రభుత్వ రహస్య పత్రాల పరిశీలనకు అవకాశం ఉండదు. గతంలో సీనియర్ పదవులు నిర్వహించినవారికి ఇది అవమానంగా ఉంటుంది. అలాగే వివిధ దర్యాప్తుల్లో సాక్ష్యాల కింద ప్రస్తావించాల్సిన పత్రాలు సేకరించడం అసాధ్యమైపోతుంది.

బ్రెన్నాన్‌కు జరిగిన అవమానంపై గతంలో నేషనల్ ఇంటలిజెన్స్ డైరెక్టర్లుగా, సీఐఏ డైరెక్టర్లుగా పనిచేసిన 12 మంది మాజీలు సంయుక్తంగా ట్రంప్‌కు అసాధారణమైన రీతిలో లేఖ రాశారు. అధ్యక్షుని చర్య వాక్ సాతంత్య్రాన్ని అణచేసేదిగా ఉందని దుయ్యబట్టారు. సీఐఏ మాజీ డైరెక్టర్లు విలియం వెబ్‌స్టర్, జార్జి టెనెట్, పోర్టర్ గాస్, మైకేల్ హేడెన్, లియాన్ పనెట్టా, డేవిడ్ పెట్రేయస్‌తోపాటు ఇంటలిజెన్స్ రంగంలోని ఇతర మాజీ సీనియర్లు ఈ లేఖపై సంతకం చేశారు. బ్రెన్నన్‌తో ఏకీభవించనంత మాత్రాన ఆయన సెక్యూరిటీ క్లియరెన్స్ రద్దు చేయడం గొంతు నొక్కడమే అవుతుందని వారు అధ్యక్షునిపై నిశ విమర్శలు సంధించారు. ఇదిలాఉండగా ఒసామా బిన్‌లాదెన్ వేటకు చేపట్టిన ఆపరేషన్‌కు నాయకత్వం వహించిన వైస్ అడ్మిరల్ విలియం హెచ్ మెక్‌రావెన్ తన సెక్యూరిటీ క్లియరెన్స్‌ను రద్దు చేయాల్సిందిగా ట్రంప్‌ను సవాల్ చేశారు.

2123
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS