శ్రీ చిన్మయ్ జయంతి యూఎస్‌లో గిన్నీస్ రికార్డు..

Wed,December 7, 2016 01:21 PM

Indian spiritual guru birthday cake sets Guinness record in US


న్యూయార్క్: భారత ఆధ్యాత్మిక గురువు శ్రీ చిన్మయ్ జయంతిని పురస్కరించుకుని యూఎస్‌లో ఏర్పాటు చేసిన బర్త్ డే కేక్ గిన్నీస్ వరల్డ్ రికార్డుల్లోకి ఎక్కింది. చిన్మయ్ కుమార్ ఘోష్‌గా ప్రసిద్ధి చెందిన శ్రీ చిన్మయ్ 85వ జయంతి సందర్భంగా యూఎస్‌లో పెద్ద బర్త్ డే కేక్‌ను సిద్ధం చేసి..దానిపై 72,585 క్యాండిళ్లను వెలిగించి రికార్డును సృష్టించారు.

న్యూయార్క్‌లోని శ్రీ చిన్మయ్ సెంటర్‌లో 100మంది బర్త్ డే కేక్ తయారీలో పాల్గొన్నారు. 80.5అడుగుల పొడవు, రెండు అడుగుల వెడల్పుతో ఈ కేక్‌ను తయారు చేశారు. గతంలో కాలిఫోర్నియాలో మైక్స్ హార్డ్ లెమెనాడే నేతృత్వంలో 50,151 క్యాండిళ్లతో నెలకొల్పిన రికార్డును తాజా ఫీట్‌తో అధిగమించారు.

chinmayirecord2


1882
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles