చర్చనీయాంశమైన ఇవాంక ట్రంప్ భద్రత!

Tue,November 14, 2017 03:00 PM

Indian Security forces discuss on Ivanka Trump security

హైదరాబాద్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంక ట్రంప్ భారతదేశ పర్యటన నేపథ్యంలో ఆమె భద్రత చర్చనీయాంశంగా మారింది. వైట్ హౌజ్ భద్రతా కార్యాలయం జారీ చేస్తున్న ఆదేశాలు ప్రధాని మోదీ భద్రతా కార్యాలయాన్ని ఇబ్బందుల్లోకి నెట్టేస్తున్నాయి. ఇవాంక భద్రతను తమకు వదిలేయాలని.. ఆమె సెక్యురిటీ అంతా తాము చూసుకుంటామంటూ కేంద్ర హోంశాఖతో పాటు ఎస్‌పీజీ(స్పెషల్‌ ప్రొటెక్షన్‌ గ్రూప్‌)కు స్పష్టమైన సూచనలు జారీ చేసినట్టు తెలుస్తోంది. ఈ నెల 28, 29 తేదీల్లో హైదరాబాద్‌లో ఆమె పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో హెచ్ఐసీసీలో జరిగే ప్రపంచ పారిశ్రామిక సదస్సులోకి పోలీస్‌ అధికారులు, సిబ్బంది ఆయుధాలతో ప్రవేశించేందుకు వీల్లేదని అమెరికా సెక్యూరిటీ వింగ్‌ స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఇవాంక ట్రంప్‌ భద్రతతో పాటు దేశ ప్రధాని మోడీ భద్రత కూడా ముఖ్యమని, ఆయన వెనక  ఆర్మ్‌డ్‌ సిబ్బంది ఉండాలని కేంద్ర హోంశాఖతో పాటు ఎస్పీజీ పట్టుబడుతున్నాయి. గతంలో టర్కీలో జరిగిన హైకమిషనర్‌ కాల్పుల వ్యవహారంతో అమెరికన్‌ సెక్యూరిటీ సదస్సులోకి ఎవరూ ఆయుధాలు తేవద్దన్న నిబంధనను పెడుతున్నట్టు కేంద్ర హోంశాఖ భావిస్తోంది. ఇవాంక ట్రంప్‌ భద్రతకు సంబంధించి అమెరికన్‌ సెక్యూరిటీయే ప్రత్యేకంగా వాహనాలు, సిబ్బందిని రంగంలోకి దించనున్నట్టు సమాచారం.

5163
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS