రన్‌వేపై పరిగెత్తి విమానం ఎక్కబోయాడు!

Thu,February 8, 2018 06:38 PM

Indian man sneaks on to runway in Sharjah to catch plane

అది షార్జా. ఇండియాకు చెందిన 26 ఏండ్ల ఇంజినీర్ ఆర్‌కే అక్కడ ఓ కంపెనీలో పని చేస్తున్నాడు. అయితే.. ఓ రోజు ఉన్నట్టుండి.. ఎయిర్‌పోర్ట్‌కు వచ్చాడు. ఎయిర్‌పోర్ట్ గోడను దూకాడు. రన్‌వేపై పరిగెత్తడం ప్రారంభించాడు. రన్‌వేపై ఉన్న ఇండియాకు వెళ్లే విమానాన్ని ఎక్కబోయాడు. ఇంతలో అతడిని గమనించిన ఎయిర్‌పోర్ట్ పోలీసులు వెంటనే అతడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడిని పోలీసులు ప్రశ్నించగా విస్తుగొలిపే సమాధానాలు చెప్పాడు.

"నా ప్రేయసిని కలవడం కోసమే నేను విమానం ఎక్కడానికి ప్రయత్నించాను. నా ప్రేయసిని చూడకుండా నేను ఉండలేను. తనేమో ఇండియాలో ఉంది. నేనేమో ఇక్కడ ఉన్నాను. నా పాస్‌పోర్ట్‌ను కంపెనీ తీసేసుకున్నది. ఇప్పటికి 15 సార్లు ఇండియా వెళ్లడానికి అనుమతి కోరాను. కంపెనీ ససేమిరా అన్నది. నా పేరెంట్స్‌ను ఒప్పించి నా ప్రేయసిని పెళ్లాడాలని అనుకున్నాను. కాని.. ఇండియా వెళ్లే దారేది. అందుకే.. ఎయిర్‌పోర్ట్ గోడను దూకి.. రన్‌వేపై డైరెక్ట్‌గా వెళ్లి విమానం ఎక్కి ఇండియా వెళ్దామనుకున్నాను. ఒకవేళ నేను దొరికితే.. కోర్టులో నాకు జరిగిన అన్యాయాన్ని విన్నవించుకొని నా పాస్‌పోర్ట్‌ను నేను తిరిగి పొందొచ్చు అని ఆలోచించాను". అయితే.. పాస్‌పోర్ట్, టికెట్ లేకుండా విమానం ఎక్కడానికి ప్రయత్నించిన ఆర్‌కేను వెంటనే పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు. అతడి వేదనను విన్న జడ్జ్ అతడికి బెయిల్ ఇచ్చి తన పాస్‌పోర్ట్ తిరిగి ఇచ్చేందుకు కంపెనీతో మాట్లాడారు. మొత్తానికి మనోడి ప్లాన్ సక్సెస్ అవడమే కాదు.. మనోడి కథ కూడా సుఖాంతమయింది.

8635
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles