ఎన్నారైకి జాక్ పాట్.. 28 కోట్ల లాటరీ తగిలింది.. కానీ..!

Sat,May 4, 2019 06:28 PM

Indian Man In UAE Wins 4 Million dollar Jackpot but he is not aware of this

భారత్‌కు చెందిన ఓ వ్యక్తికి యూఏఈలో జాక్ పాట్ తగిలింది. అబుదబీలో లాటరీ డ్రాలో ఆ వ్యక్తి లక్కీ విన్నర్ అయ్యాడు. దీంతో ఆయనకు 28 కోట్ల రూపాయల లాటరీ తగిలింది.

షార్జాలో నివసించే షోజిత్ కేఎస్ అబుదబీలో బిగ్ టికెట్ సిరీస్ డ్రాలో ఈ లాటరీని గెలుచుకున్నాడు. ఏప్రిల్ 1న ఆ వ్యక్తి లాటరీ టికెట్ కొన్నాడు. కానీ.. అతడికి ఈ లాటరీ తగిలినట్టు మాత్రం తెలియదు. అదే ట్విస్ట్ ఇక్కడ. లాటరీని తీసేటప్పుడు లాటరీ నిర్వాహకులు యూట్యూబ్ స్ట్రీమింగ్ కూడా పెట్టారు. అయితే.. యూట్యూబ్ స్ట్రీమింగ్ పెట్టిన విషయం కానీ.. అసలు, ఆ లాటరీ తనకు తగిలినట్టుగానీ ఆ వ్యక్తికి తెలియకపోవడంతో.. లాటరీ నిర్వాహకులు ఆయనకు ఫోన్లు చేయడం ప్రారంభించారు.

అయితే.. వాళ్ల ఫోన్లను ఈయన రిజెక్ట్ చేస్తున్నారట. ఏవో.. టైమ్ పాస్ కాల్స్ అనుకున్నాడో ఏమో.. వాటిని అతడు రిజెక్ట్ చేస్తుండటంతో ఏం చేయాలో తెలియక తలలు పట్టుకున్నారు లాటరీ నిర్వాహకులు.

అతడు మా కాల్స్‌ను రిజెక్ట్ చేస్తున్నాడు. అయినప్పటికీ మేము అతడికి కాల్ చేస్తూనే ఉంటాం. ఒకవేళ ఆయన కాల్స్‌కు రెస్పాండ్ కాకపోతే.. అతడి ఇంటికి వెళ్తాం. ఆయన ఎక్కడ ఉంటారో మాకు తెలుసు.. అని లాటరీ నిర్వాహకులు తెలిపారు. బిగ్ టికెట్ లాటరీని అబుదబీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రతి నెల నిర్వహిస్తారట.

ఇప్పటి వరకు తీసిన ఈ లాటరీలో ఇండియన్స్ చాలామందే గెలిచారు. ఇదే డ్రాలో మంగేశ్ మైండే అనే ఇండియన్ కూడా బీఎండబ్ల్యూ 220ఐ కారును గెలుచుకున్నారట. ఈ లాటరీలో 8 మంది భారతీయులు, ఒక పాకిస్తానీ కలిపి మొత్తం 9 మంది కన్సోలేషన్ బహుమతులు గెలుచుకున్నారు.

గత సంవత్సరం ఇదే డ్రాలో కేరళకు చెందిన జాన్ వర్గీస్.. 12 మిలియన్ దిర్హమ్స్ గెలుచుకున్నారు. ఈ సంవత్సరం జనవరిలో మరో కేరళ వ్యక్తి కూడా 12 మిలియన్ దిర్హమ్స్ గెలుచుకున్నారు. అక్టోబర్ 2017లో నిర్వహించిన మెగా లాటరీ డ్రాలో 8 మంది భారతీయులు 1 మిలియన్ దిర్హమ్స్ గెలుచుకున్నారు.

4809
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles