ఐసిస్ రిక్రూటర్ షఫీ ఆర్మర్ హతం

Mon,April 25, 2016 01:22 PM

Indian ISIS recruiter Shafi Armar dead

న్యూఢిల్లీ : ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థకు భారతీయులను రిక్రూట్ చేస్తున్న ఉగ్రవాది మొహమ్మద్ షఫీ ఆర్మర్ హతమైనట్లు తెలుస్తోంది. సిరియాలో అమెరికా చేపట్టిన వైమానిక దాడుల్లో ఆ ఉగ్రవాది మృతిచెందాడు. కర్నాటకలోని భత్కాల్ ఉగ్రవాది షఫీ స్వగ్రామం. ఇటీవలే అతను రిక్రూట్ చేసిన 14 మంది ఐసిస్ మద్దతుదారులను భారత పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. సిరియాలో జరిగిన వైమానిక దాడిలో షఫీ ఆర్మర్ మృతిచెందినట్లు ఆదివారం ఇంటెలిజెన్స్ అధికారులకు సమాచారం అందింది. ఆ సమాచారాన్ని అధికారులు సమీక్షిస్తున్నారు. ఐసిస్ సోషల్ మీడియాలోనూ ఆ అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ఇంటెలిజెన్స్ అధికారులు వెల్లడించారు. ఎన్‌ఐఏ, ఐబీ అధికారులు ఇటీవల దేశవ్యాప్తంగా నిర్వహించిన తనిఖీల్లో సుమారు 14 మంది ఐసిస్ మద్దతుదారులను ఆధీనంలోకి తీసుకున్నారు. అందులో కర్నాటకకు చెందిన ఆరుగురికి ఐసిస్‌తో నేరుగా సంబంధాలు ఉన్నట్లు స్పష్టమైంది. జానూద్ అల్ ఖలిఫా పేరుతో షఫీ ఆర్మర్ ఓ నెట్‌వర్క్‌ను నడిపిస్తున్నట్లు ఇంటెలిజెన్స్ అధికారులు గుర్తించారు. తొలుత ఇండియన్ ముజాహిదిన్‌కు ఆర్మర్ పనిచేశాడు.

4876
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles