యూఏఈలో భారతీయుడికి రూ.18 కోట్ల జాక్‌పాట్

Sun,June 3, 2018 08:53 PM

Indian in UAE hits jackpot wins Rs 18 crore in lottery

దుబాయ్ : యూఏఈలో మరో భారతీయుడికి జాక్‌పాట్ తగిలింది. విమానాశ్రయంలో నిర్వహించిన బిగ్ టికెట్ అబుదుబాయ్ లాటరీ రూపంలో అదృష్టం వరించింది. రూ.18 కోట్లు సొంతమైంది. ప్రస్తుతం నైజీరియాలో నివసిస్తున్న భారత్‌కు చెందిన డిక్సాన్ కట్టిథారా అబ్రహామ్ యూఏఈలో బిగ్ టికెట్ అబుదుబాయ్ పేరుతో నిర్వహించే లాటరీని కొనుగోలు చేశాడు. అబుదుబాయ్ విమానాశ్రయం ఆదివారం ఉదయం లాటరీ విజేతలను ప్రకటించింది. అబ్రహామ్ రూ.18 కోట్లు (10 మిలియన్ దిర్హం) గెలుచుకున్నట్టు వెల్లడించింది. మరో 9 మంది విజేతల్లో ఐదుగురు భారతీయులు కాగా, ముగ్గురు పాకిస్థానీయులు, ఒకరు యూఏఈకి చెందినవారు ఉన్నట్టు పేర్కొన్నది. దుబాయ్‌లో డ్రైవర్‌గా పనిచేస్తున్న భారతీయుడు ఈ ఏడాది ఏప్రిల్‌లో నిర్వహించిన లాటరీలో విజేతగా నిలిచి దాదాపు రూ.22 కోట్లు గెలుచుకోగా, జనవరిలోనూ ఓ భారతీయుడు ఇంతే మొత్తాన్ని సొంతం చేసుకున్నాడు.

4511
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles