పిల్లాడు కాదు చిచ్చరపిడుగు.. 13 ఏళ్లకే సాఫ్ట్‌వేర్ కంపెనీ పెట్టాడు..!

Sun,December 16, 2018 09:50 PM

Indian Boy Had Mobile App At 9 and At 13 He Owns Software Company In Dubai

అవును.. చిచ్చరపిడుగే. లేకపోతే.. 13 ఏళ్లకే సాఫ్ట్‌వేర్ కంపెనీ పెట్టడం ఏంటి. అది కాదు అసలు ట్విస్ట్. మరో ట్విస్ట్ ఏంటంటే.. 9 ఏళ్లకే ఆ పిల్లాడు మొబైల్ యాప్‌ను డిజైన్ చేశాడు. షాక్ అయ్యారా? అవును.. ఆ చిచ్చరపిడుగు గురించి తెలుసుకోవాలనుందా.. అయితే రండి.. తెలుసుకుందాం.

ఆ చిచ్చర పిడుగుది కేరళనే. పేరు ఆదిత్యన్ రాజేశ్. కానీ.. చిన్నప్పుడే వాళ్ల కుటుంబం దుబాయ్‌కి వెళ్లిపోయింది. ఇక.. అక్కడే మనోడికి కంప్యూటర్ అలవాటయింది. రాజేశ్‌కు ఐదేళ్ల వయసు ఉన్నప్పుడే కంప్యూటర్ అలవాటయిందట. బీబీసీ టైపింగ్ అనే ఓ కిడ్స్ వెబ్‌సైట్‌ను తన తండ్రి రాజేశ్‌కు పరిచయం చేశాడట. అలా.. కంప్యూటర్‌పై పట్టు సాధించడం ప్రారంభించాడు. అలా... కంప్యూటర్ లాంగ్వేజీలను కూడా నేర్చుకోవడం ప్రారంభించాడట. తనే సొంతంగా ఇంటర్నెట్‌లో చూసి నేర్చుకున్నాడట. సాఫ్ట్‌వేర్ లాంగ్వేజీలన్నీ నేర్చుకున్నాక.. బోరు కొడుతుంటే తన తొమ్మిదేళ్ల వయసులో ఏకంగా మొబైల్ అప్లికేషన్‌నే డెవలప్ చేశాడు. అది సక్సెస్ అవడంతో ఇక.. వెనక్కి తిరిగి చూసుకోలేదు రాజేశ్. ఆ తర్వాత వైబ్‌సైట్లను డెవలప్ చేయడం, లోగోలు డిజైన్ చేయడం ప్రారంభించాడు.

అలా.. తన 13 ఏళ్ల వయసులో దుబాయ్‌లో ట్రైనెట్ సొల్యూషన్స్ అనే సాఫ్ట్‌వేర్ కంపెనీని నెలకొల్పాడు. ప్రస్తుతం తన కంపెనీలో ముగ్గురు ఉద్యోగులు కూడా ఉన్నారు. ప్రస్తుతం 12 మంది క్లయింట్లు కూడా ఉన్నారట. కాకపోతే మనోడి వయసు 18 దాటలేదు కదా. అందుకే.. కంపెనీలాగ తన ఎంప్లాయిస్‌తో కలిసి క్లయింట్లకు వర్క్ చేస్తున్నాడట. రాజేశ్.. తన క్లయింట్లకు ఉచితంగా అప్లికేషన్లు డెవలప్ చేసి ఇస్తున్నాడట. సూపర్ కదా. నువ్విప్పుడే ఇలా ఉంటే.. తర్వాత ఏకంగా గూగుల్‌కు పోటీ ఇచ్చేట్టున్నావు రాజేశ్. కీపిటప్ మై బాయ్.

4752
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles