కాలిఫోర్నియా గవర్నర్ పదవికి పోటీలో భారత సంతతి టెకీ

Sat,June 2, 2018 11:32 AM

Indian American techie to fight for California Governors Candidacy

లాస్‌ఏంజిల్స్ : అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో త్వరలో గవర్నర్ పదవికి ఎన్నికలు జరగనున్నాయి. ఆ రాష్ట్ర గవర్నర్ పదవి కోసం భారతీయ సంతతికి చెందిన 22 ఏళ్ల శుభమ్ గిల్ పోటీ చేస్తున్నాడు. కాలిఫోర్నియా గవర్నర్ పదవి పోటీలో ఉన్న అత్యంత పిన్న వయస్కుడు అతనే. రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలకు ప్రాక్టికల్ సొల్యూషన్ కావాలంటున్నాడతను. శుభమ్ గిల్‌కు.. ఉత్తరప్రదేశ్‌తో లింకు ఉన్నది. ప్రస్తుతం శుభమ్ కాలిఫోర్నియాలో వర్చువల రియాల్టీ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. ఓటర్లను ఆకర్షించేందుకు అతను సోషల్ మీడియాలోని అన్ని ఫ్లాట్‌ఫామ్‌లను వాడుకుంటున్నాడు. నగరంలోని వీధుల్లోనూ అతను మైక్ పట్టుకుని ప్రచారం నిర్వహిస్తున్నాడు. రాజకీయ వ్యవస్థ పారదర్శకత రావాలని కోరుకుంటున్నాడు. శుభమ్‌తో పాటు గవర్నర్ పోస్ట్‌కు మొత్తం 27 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు.2365
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles