అమెరికా నుంచి రోమియో హెలికాప్టర్లు!

Sun,November 18, 2018 08:43 AM

India buy romeo helicopters from America

వాషింగ్టన్: అమెరికా నుంచి ఎంహెచ్-60 రోమియో హెలికాప్టర్లను నావికాదళం కోసం కొనుగోలు చేయాలని నిర్ణయించినట్టు భారత రక్షణ పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. 24 బహుళ వినియోగ, జలాంతర్గామి విధ్వంసక రోమియో హెలికాప్టర్లను 200 కోట్ల డాలర్ల (సుమారు రూ.14,357 కోట్లు) వ్యయంతో కొనుగోలు చేయనున్నట్టు పేర్కొన్నాయి. దశాబ్ద కాలంగా ఈ హెలికాప్టర్లు కావాలని కోరుతున్నామని, ఇప్పుడు వాటి అవసరం ఎక్కువగా ఉన్నదని తెలిపాయి. ఈ ఒప్పందం త్వరలో ఖరారు కానుందని అనధికారవర్గాల ద్వారా తెలిసింది. ఇటీవల సింగపూర్‌లో అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్‌తో ప్రధాని మోదీ భేటీ అయినప్పుడు ఈ అంశంపై ఒక అవగాహన కుదిరినట్టు ఆ వర్గాలు పేర్కొన్నాయి. 24 బహుళ వినియోగ రోమియా హెలికాప్టర్లు కావాలని కోరుతూ భారత్ అమెరికాకు ఒక లేఖ రాసిందని తెలిపాయి. భారత రక్షణ అవసరాల కోసం ట్రంప్ సర్కార్ తమ హైటెక్ సైనిక పరిజ్ఞానాన్ని అందుబాటులో ఉంచడంతో ఉభయ దేశాల మధ్య రక్షణ సంబంధాలు జోరందుకున్నాయి.

1397
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles