వైట్‌హౌస్‌లో నమ్మలేని వారున్నారు.. మెలానియె సంచలన వ్యాఖ్య

Thu,October 11, 2018 06:14 PM

in white house there are people you cant trust says melanie Trump

వైట్‌హౌస్‌లో నమ్మలేనివారే ఎక్కువని అమెరికా ప్రథమ మహిళ మెలానియె ట్రంప్ అన్నారు. గతంలో పనిచేసినవారా లేక ఇంకా ఉన్నారా అంటే ఇప్పటికీ ఉన్నారని ఆమె పేర్కొన్నారు. ఎవరు ఎలాంటివారో తెలియదని, ఎప్పుడు వెన్నుపోచటు పొడుస్తారో అని వీపు తడుముకుంటూ తిరగాలని మెలాయనె చేసిన వ్యాఖ్యలు దూమారం రేపుతున్నాయి. పాలనా వ్యవహారాలు చాలా కష్టమని, ఎప్పుడూ మనుషుల మీద ఓ కన్నేసి ఉంచాలని ఆమె ఏబీసీ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ట్రంప్ వైట్‌హౌస్‌లో ప్రతిఘటన చాలానే ఉందంటూ గతనెల న్యూయార్క్ టైమ్స్ పత్రికలో రచయిత పేరు లేకుండా వచ్చిన ఆప్-ఎడ్ వ్యాసం సంచలనం సృష్టించిన నేపథ్యంలో మెలానియె వ్యాఖ్యలు ప్రాముఖ్యం సంతరించుకున్నాయి.

ప్రపంచంలో ఎగా బెదిరింపులకు గురైనవ వ్యక్తి కూడా తానేనని మెలానియె ఆ ఇంటర్వ్యూలో చెప్పుకోవడం గమనార్హం. సైబర్ బెదిరింపులకు గురికాకుండా పిల్లలను పెంచడంపై తాను నిర్వహిస్తున్న ప్రచారోద్యమానికీ అడ్డంకులు ఎదురవుతున్నాయని ఆమె తెలిపారు. ఏదిఏమనైనా తాను మాత్రం నిజాయితీగా అధ్యక్షుడైన తన భర్తస ట్రంప్‌కు సలహాలు, సూచనలు ఇస్తానని చెప్పారు. వాటి అమలును ఆయన ఇష్టానికే వదిలేస్తానని వివరించారు.

2222
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles