ఒబామా గురించి అడిగితే లాడెన్ గురించి చెప్పాడు: వైరల్ క్విజ్

Thu,August 16, 2018 03:43 PM

In Viral Quiz Show Fail contestant confuses Obama With Osama

నిన్న గాక మొన్ననే కదా హు వాంట్స్ టు బి ఏ మిలియనీర్.. అనే టర్కీ కంటెస్ట్‌లో ఓ యువతి గ్రేట్ వాల్ ఆఫ్ చైనా ఎక్కడుంది అని అడిగిన ప్రశ్నకు రెండు లైఫ్ లైన్లు ఉపయోగించుకున్నదని విన్నాం. ఆ షోకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కొన్ని రోజులు దాని మీదే నెటిజన్లు చర్చించుకున్నారు. మెల్లగా ఆ విషయాన్ని నెటిజన్లు మరిచిపోతున్న తరుణంలో నెటిజన్లకు మరో క్విజ్ దొరికింది. ఈసారి కంటెస్టంట్ ప్రశ్నను తప్పుగా అర్థం చేసుకొని ఒకరి గురించి అడిగితే మరొకరి గురించి సమాధానం చెప్పడంతో ఆ క్విజ్ క్లిప్ కాస్త వైరల్‌గా మారింది. ది 100,000 డాలర్ పిరమిడ్ అనే గేమ్ షోలో ఈ వింత ఘటన చోటు చేసుకున్నది.హాలీవుడ్ కమెడియన్ ఇవాన్ కౌఫ్‌మాన్ ఆ గేమ్ షోలో కంటెస్టెంట్‌గా వెళ్లాడు. ఇక.. మరో యాక్టర్, కమెడియన్ టిమ్ మీడోస్‌తో జత కట్టి ఇద్దరు కలిసి ఆ గేమ్ షోలో పార్టిసిపేట్ చేశారు. ఇక.. గేమ్ షోలో వాళ్లకు గేమ్ నిర్వాహకులు ఓ ప్రశ్న వేశారు. ఒబామా చివరి పేరుతో ఉన్న వ్యక్తుల పేర్లు చెప్పండి.. అనేదే వాళ్ల ప్రశ్న. ఇక కమెడియన్ ఇవాన్ తన కో కంటెస్టంట్‌కు క్లూ ఇవ్వాలనుకున్నాడు. వెంటనే ఒబామా చివరి పేరుతో ఉన్న వ్యక్తులు బిన్ లాడెన్ అనేశాడు. ఒబామాను ఒసామా అనుకొని కన్ఫ్యూజ్ అయి అలా చెప్పి ఉంటాడు. కాని.. షో నిర్వాహకులు మాత్రం అతడి క్లూను విని షాక్‌కు గురయ్యారు. ఇక్కడ ఇంకో విచిత్రం ఏంటంటే.. ఈ కమెడియన్ కౌఫ్‌మాన్‌కు బరక్ ఒబామా ట్విట్టర్‌లో ఫాలోవర్‌గా ఉన్నాడు. ఇక.. ఈ క్విజ్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నది. దీనిపై నెటిజన్లు కూడా రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.2199
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS