ఇమ్రాన్ ఖాన్ ఓటు రద్దు !

Wed,July 25, 2018 01:29 PM

Imran Khans vote may be cancelled

ఇస్లామాబాద్: పాకిస్థాన్ తెహ్రీక్ ఇన్సాఫ్(పీటీఐ) పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ చిక్కుల్లో పడ్డారు. ఇవాళ జరుగుతున్న ఆ దేశ సార్వత్రిక ఎన్నికల్లో ఆయన ఓటేశారు. అయితే ఇమ్రాన్ ఓటు రద్దు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇమ్రాన్ ఓటు వేస్తున్నప్పుడు ఆ ఘటనను మీడియా లైవ్ చేసింది, అంతేకాకుండా పీటీఐ చీఫ్ ఓటు వేస్తున్న సందర్భాన్ని వీడియో తీశారు. అయితే పాక్ ఎన్నికల నియమావళి ప్రకారం అలా చేయకూడదు. సీక్రెట్ బ్యాలెట్ నియమాన్ని ఉల్లంఘించినట్లే అవుతుందని వాదనలు వినిపిస్తున్నాయి.

మీడియా స‌మ‌క్షంలోనే ఇమ్రాన్‌.. బ్యాలెట్ పేప‌ర్‌పై స్టాంప్ వేశారు. అది కూడా ప్రిసైడింగ్ ఆఫీస‌ర్ టేబుల్ మీదే ఆ ఓటేశారు. దీంతో ఇమ్రాన్ ఓటుపై వివాదం చెల‌రేగింది. ర‌హ‌స్యంగా వేయాల్సిన ఓటును ఆయ‌న కెమెరా క‌ళ్ల ముందు వేయ‌డం వివాదానికి తెర‌లేపింది. పాక్ ఎన్నికల సంఘం కూడా ఇమ్రాన్ ఓటు రద్దు అంశాన్ని పరిశీలించనున్నట్లు తెలుస్తోంది. ఎన్‌ఏ-53 ఇస్లామాబాద్ నియోజకవర్గం నుంచి ఇమ్రాన్ పోటీ చేస్తున్నారు. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఈ సందర్భంగా ఇమ్రాన్ దేశ ప్రజలను కోరారు.

పాక్ ఎన్నిక‌ల నియ‌మావ‌ళిలోని 185 సెక్ష‌న్ ప్ర‌కారం .. ఓటును ర‌హ‌స్యంగా వేయాలి. ఒక‌వేళ ఓటింగ్‌ను బ‌హిరంగంగా వేస్తే ఆ సెక్ష‌న్ ప్ర‌కారం స‌ద‌రు వ్య‌క్తికి 6 నెల‌ల జైలు శిక్ష విధిస్తారు. దానితో పాటు రూ.వెయ్యి జ‌రిమానా వేస్తారు. మీడియాలో వ‌స్తున్న వార్త‌ల‌ను క‌ట్ట‌డి చేయాల‌ని ఇమ్రాన్ పార్టీ ఎన్నిక‌ల సంఘాన్ని కోరింది. పాక్ ఎన్నిక‌ల సంఘం ఇమ్రాన్‌కు నోటీసు జారీ చేసింది. ఎన్నిక‌ల నియ‌మావ‌ళి ఉల్ల‌తంఘ‌న కింద‌ జూలై 30వ తేదీన విచార‌ణకు హాజ‌రుకావాలంటూ ఆదేశించింది.

3873
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS