లిఖిత‌పూర్వ‌క క్ష‌మాప‌ణ‌లు చెప్పిన కాబోయే ప్ర‌ధాని

Fri,August 10, 2018 01:50 PM

Imran Khan submits written apology in EC violation case

ఇస్లామాబాద్: పాకిస్థాన్ ఎన్నిక‌ల సంఘం కోరిన విధంగానే.. కాబోయే ప్ర‌ధాన‌మంత్రి ఇమ్రాన్ ఖాన్ క్ష‌మాప‌ణ‌లు చెప్పారు. రాత‌పూర్వ‌కంగా క్ష‌మాప‌ణ‌లు చెప్పిన ఇమ్రాన్ దానికి సంబంధించిన అఫిడ‌విట్‌ను ఎన్నిక‌ల సంఘానికి ఇవాళ స‌మ‌ర్పించారు. గత నెల 25వ తేదీన జరిగిన పాకిస్థాన్ సార్వత్రిక ఎన్నికల్లో .. ఇమ్రాన్ ఎన్నిక‌ల కోడ్‌ను ఉల్లంఘించారు. ఇస్లామాబాద్‌లో ఓటేసిన ఆయ‌న‌.. ప‌బ్లిక్‌గా మీడియా ముందు ఓటేశారు. ర‌హ‌స్యంగా వేయాల్సిన ఓటును ఆయ‌న అంద‌రి ముందు వేశారు. దీంతో ఆయ‌న‌పై సుమోటో కేసు న‌మోదైంది. ఈ ఘ‌ట‌న‌లో లిఖితపూర్వక క్షమాపణ చెప్పాలని కాబోయే ప్రధానమంత్రి, తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ అధినేత ఇమ్రాన్‌ఖాన్‌ను పాకిస్థాన్ ఎన్నికల సంఘం గురువారం ఆదేశించింది.

ఇమ్రాన్ తరఫు న్యాయవాదులు తమ వాదనలు వినిపిస్తూ.. ఇమ్రాన్‌ఖాన్ ఉద్దేశపూర్వకంగా ఆ పనిచేయలేదని పేర్కొన్నారు. ఈ వాదనతో విభేదించిన కమిషన్.. ఇమ్రాన్‌ఖాన్ క్షమాపణ కోరుతూ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఆ ఆదేశాల ప్ర‌కారమే ఇవాళ ఇమ్రాన్ లిఖిత పూర్వ‌క క్ష‌మాప‌ణ‌లు చెప్పారు. ఇస్లామాబాద్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి మాజీ ప్ర‌ధాని షాహిద్ ఖాక‌న్ అబ్బాసీపై ఇమ్రాన్ విక్ట‌రీ సాధించారు.

2818
Follow us on : Facebook | Twitter
Namasthe Telangana Property Show

More News

VIRAL NEWS