నయా పాకిస్థాన్..

Thu,July 26, 2018 06:54 AM

Imran Khan party may need coalition partner to form government

ఇస్లామాబాద్: నయా పాకిస్థాన్ ఆవిర్భవించింది. బుధవారం జరిగిన జాతీయ అసెంబ్లీ ఎన్నికల్లో ఓ రకంగా హంగ్ పార్లమెంట్ ఏర్పడింది. ఇమ్రాన్ ఖాన్‌కు చెందిన పాకిస్థాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ పార్టీ లీడింగ్‌లో ఉన్నది. ఆ పార్టీకి ఇప్పటి వరకు 113 స్థానాల్లో ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. పోలింగ్ ముగిసి 12 గంటలు దాటినా.. పూర్తి ఎన్నికల ఫలితాలు ఇంకా విడుదల కాలేదు. దీంతో భారీగా రిగ్గింగ్ జరిగిందన్న ఆరోపణలు వస్తున్నాయి. తాజా ఎన్నికల్లో పీటీఐ ఆధిక్యాన్ని సాధించడంతో ఆ పార్టీ కార్యకర్తలు దేశవ్యాప్తంగా సంబరాల్లో తేలిపోతున్నారు. సాంకేతిక సమస్యల కారణంగా ఫలితాల వెల్లడిలో ఆలస్యం జరుగుతోందని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మొహమ్మద్ రాజా ఖాన్ తెలిపారు. రిజల్ట్స్ ట్రాన్స్‌మిషన్ సిస్టమ్‌లో జరుగుతున్న జాప్యం వల్ల ఫలితాల వెల్లడి కూడా ఆలస్యమవుతోందన్నారు.

ఇప్పటి వరకు 47 శాతం పోలింగ్ స్టేషన్లలో కౌంటింగ్ పూర్తి అయ్యింది. దాంట్లో పీటీఐ పార్టీ 113, పీఎంఎల్‌ఎన్ పార్టీ 64, పీపీపీ పార్టీ 43 స్థానాలతో దూసుకెళ్లుతున్నాయి. అతిపెద్ద రాష్ట్రమైన పంజాబ్‌లో పీఎంఎల్ ఎన్ పార్టీ ఆధిక్యంలో ఉన్నది. కానీ ఖైబర్ ఫక్తున్సాలో మాత్రం పీటీఐ లీడింగ్‌లో ఉన్నది. సింధ్‌లో పీపీపీ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతున్నది. జాతీయ అసెంబ్లీలో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 137 సీట్లు అవ‌స‌రం ఉంటుంది. అయితే లీడింగ్‌లో ఉన్న ఇమ్రాన్ పార్టీ.. ప్ర‌భుత్వ ఏర్పాటుకు చిన్న పార్టీలు, ఇండిపెండెంట్ల సాయం తీసుకునే అవ‌కాశం ఉన్న‌ది.

3442
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles