ఇమ్రాన్‌ఖాన్ భారత్ వ్యతిరేకి కాదు!

Thu,July 26, 2018 05:25 PM

Imran Khan is not against India says Parvez Musharraf

ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లో మాజీ క్రికెటర్ ఇమ్రాన్‌ఖాన్ నేతృత్వంలోని పాకిస్థాన్ తెహ్రీకె ఇన్సాఫ్ అధికారంలోకి రావడం దాదాపు ఖాయమైంది. 272 స్థానాలున్న పాకిస్థాన్ నేషనల్ అసెంబ్లీలో పీటీఐ అతిపెద్ద పార్టీగా నిలిచింది. ఈ నేపథ్యంలో పాక్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ ఫలితాలపై స్పందించారు. ప్రజలు ఇచ్చిన తీర్పును ఆయన స్వాగతించారు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇమ్రాన్‌ఖాన్‌కు కొన్ని సమస్యలు ఉన్నా.. ఆయన చాలా నిజాయతీపరుడు. మంచివాడు. ఏదో మంచి చేయలని అనుకుంటున్నారు అని ముషారఫ్ అన్నారు. ఇమ్రాన్ దూకుడుగా వ్యవహరిస్తారు. గతంలో ఉన్న నవాజ్ షరీఫ్ ఇండియాను సంతోషపెట్టడానికి చూసేవారు. ఇమ్రాన్ మాత్రం ఇండియా తీరును బట్టి స్పందిస్తారు అని ముషారఫ్ అభిప్రాయపడ్డారు.

అయితే ఇమ్రాన్‌ఖాన్ మాత్రం ఇండియా వ్యతిరేకి ఏమాత్రం కాదని ఆయన స్పష్టంచేశారు. ఇండియాకు వ్యతిరేకంగా ఆయన ఎప్పుడూ మాట్లాడలేదు అని ముషారఫ్ చెప్పారు. ఇమ్రాన్‌కు ఇప్పటికీ పాలనపై అంతగా అవగాహన లేదని, మెల్లగా నేర్చుకుంటారని అన్నారు. రిగ్గింగ్ ఆరోపణలు అవాస్తవమని, పాకిస్థాన్‌లో ఓడిన పార్టీ ఇలాంటి ఆరోపణలు చేయడం సహజమేనని ముషారఫ్ స్పష్టంచేశారు. మరోవైపు ఇమ్రాన్ పార్టీ పీటీఐ.. ట్విటర్‌లో చేసిన పోస్ట్ ఆసక్తి రేపుతున్నది. ప్రధాని కార్యాలయం ఫొటోలను పోస్ట్ చేస్తూ.. త్వరలోనే ఓ వ్యక్తి ఇక్కడికి రాబోతున్నారు అని ట్వీట్ చేసింది.


2477
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS