ఇమ్రాన్ ఖాన్‌ మాజీ భార్య ఎవరికి ఓటేసిందంటే..

Wed,July 25, 2018 05:08 PM

Imran Khan ex wife Reham Khan tweets that she voted for billi

ఇస్లామాబాద్: పాకిస్థాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ పార్టీ అధినేత, మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య, టీవీ యాంకర్ రెహమ్ ఖాన్ తన ఓటును ఎవరికి వేసిందో తెలుసా. ఇవాళ జరిగిన జాతీయ ఎన్నికల్లో తాను ఓటేసినట్లు రెహమ్ ఖాన్ తన ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. అయితే ఈసారి ఆమె తన ఓటును పిల్లికి వేసినట్లు ఫోటోను పోస్ట్ చేసి, దానికి ఓ ట్యాగ్ కూడా పెట్టింది. నిజానికి రెహమ్ ఖాన్ ఎవరికి ఓటేసిందన్న దానిపై స్పష్టత లేదు. కానీ ఆమె మాత్రం మాజీ భర్త ఇమ్రాన్ పార్టీకి మాత్రం ఓటేయలేదని స్పష్టమవుతున్నది. రెహమ్ ట్వీట్‌ను అంచనా వేస్తున్న కొందరు.. ఆమె నవాజ్ షరీఫ్‌కు చెందిన పీఎంఎల్‌ఎన్ పార్టీకి ఓటేసినట్లు అనుమానిస్తున్నారు. షరీఫ్ పార్టీ సింబర్ పులి. కానీ రెహమ్ మాత్రం తన ట్వీట్‌లో పిల్లికి ఓటేసినట్లు పేర్కొన్నది. ఇమ్రాన్‌కు చాన్నాళ్ల క్రితమే రెహమ్ విడాకులిచ్చింది. ఇమ్రాన్‌కు చెందిన పీటీఐ పార్టీకి ప్రధానంగా పోటీ ఇస్తున్న పీఎంఎల్‌ఎన్‌కు రెహమ్ ఓటు వేసి ఉంటుందని భావిస్తున్నారు.2350
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles