అయిదు స్థానాల నుంచి పోటీ చేసిన ఇమ్రాన్ ఖాన్

Thu,July 26, 2018 07:44 AM

Imran Khan contested from five constituencies for Pak National Assembly polls

ఇస్లామాబాద్: పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ జాతీయ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఎన్ని స్థానాల నుంచి పోటీపడ్డారో తెలుసా. ఇమ్రాన్ మొత్తం అయిదు స్థానాల నుంచి ప్రధాని పదవి కోసం పోటీపడ్డారు. బన్నూ(ఎన్‌ఏ-26), రావల్పిండి(ఎన్‌ఏ-61), మియాన్‌వాలి(ఎన్‌ఏ-95), లాహోర్(ఎన్‌ఏ-131), కరాచీ(ఎన్‌ఏ234) స్థానాల నుంచి పీటీఐ చీఫ్ పోటీపడ్డారు. అయితే ఇప్పటి వరకు రెండు స్థానాల ఫలితాలు విడుదలయ్యాయి. కరాచీ, మియాన్‌వాలీ స్థానాల్లో ఇమ్రాన్ విక్టరీ సాధించారు.

బన్నూ స్థానం ఖైబర్ ఫక్తుక్వా ప్రావిన్సులో ఉన్నది. ఇక్కడ పీపీపీ నేత సయిదా యస్మీన్ సఫ్‌దార్‌పై ఇమ్రాన్ పోటీ చేస్తున్నారు. రావల్పిండిలో సాధారణంగా జియా ఉల్ హక్‌కు చెందిన పార్టీ ఆధిపత్యం ప్రదర్శించేది. 1998 నుంచి ఈ స్థానం నుంచి పీఎంఎల్‌ఎన్ గెలుస్తోంది. అయితే రావల్పిండిలో ఇమ్రాన్ ఈసారి ప్రభంజనం సృష్టించాలనుకుంటున్నారు. మియాన్‌వాలీ సీటును ఇప్పటికే ఇమ్రాన్ తన ఖాతాలో వేసుకున్నారు. ఇదే స్థానం నుంచి 2002, 2013లోనూ ఆయన గెలుపొందారు. ఈసారి పీఎంఎల్‌ఎన్ అభ్యర్థి ఒబదుల్లా కాన్ షాదిఖేల్‌పై విజయం సాధించారు. లాహోర్‌లో మాత్రం ఇమ్రాన్‌కు గట్టి పోటీ ఉంది. ప్రత్యర్థి ఖ్వాజా సాద్ రఫీక్ తీవ్ర పోటీనిస్తున్నారు. కరాచీ సీటును కూడా ఇమ్రాన్ గెలుచుకున్నారు. పాపులర్ లీడర్ అలీ రాజా అబిదిపై ఆయన విజయ ఢంకా మోగించారు.

2818
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles