హిట్ల‌ర్ యూ ట‌ర్న్ తీసుకోలేదు.. అందుకే ఓడిపోయాడ‌న్న ఇమ్రాన్ ఖాన్‌

Sat,November 17, 2018 08:41 AM

Imran Khan cites Hitler to explain why U turns are vital in politics

ఇస్లామాబాద్: రాజ‌కీయ నాయ‌కులు యూ ట‌ర్న్ తీసుకోవ‌డం స‌హ‌జ‌మ‌ని పాకిస్థాన్ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. దీంతో ఆ దేశ సోష‌ల్ మీడియాలో ఇమ్రాన్ వ్యాఖ్య‌లు క‌ల‌క‌లం రేపుతున్నాయి. ఇమ్రాన్ ప్ర‌భుత్వాన్ని చేప‌ట్టి 100 రోజులు కావాస్తున్న‌ది. ఈ నేప‌థ్యంలో ఆయ‌న ఇటీవ‌ల కొంత మంది జ‌ర్న‌లిస్టుల‌తో మాట్లాడారు. ఆ స‌మ‌యంలో రాజ‌కీయ నాయ‌కులు తాము చేసిన వాగ్ధానాల నుంచి ఎలా త‌ప్పించుకుంటారో అన్న విష‌యాన్ని ఆయ‌న త‌న మాటల్లో చెప్పుకొచ్చారు. యూ ట‌ర్న్ తీసుకోని నాయ‌కుడు అస‌లైన నేత కాద‌ని ఇమ్రాన్ అన్నారు. త‌న వ్యాఖ్య‌ల‌ను స‌మ‌ర్థించుకోవ‌డం కోసం ఆయ‌న హిట్ల‌ర్‌ను కూడా గుర్తు చేశారు. రెండ‌వ ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో హిట్ల‌ర్ యూ ట‌ర్న్ తీసుకోక‌పోవ‌డం వ‌ల్లే ఆ యుద్ధంలో ఓడిపోవాల్సి వ‌చ్చింద‌ని ఇమ్రాన్ అన్నారు. నెపోలియ‌న్ కూడా ఇలాంటి త‌ప్పే చేశార‌న్నారు. ముందుకు న‌డుస్తున్న‌ప్పుడు ఎదురుగా గోడ ఉంటే ఏం చేస్తారు, అప్పుడు ఏదో ఒక దారి వెతుక్కోవాల్సి వ‌స్తుంద‌ని ఇమ్రాన్ స‌మ‌ర్థించుకున్నారు. ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను మెరుగుప‌రుస్తామ‌ని, అవినీతిని అంతం చేస్తామ‌ని, పేద‌రిక నిర్మూల‌న కోసం చ‌ర్య‌లు చేప‌డుతామ‌ని ఎన్నిక‌ల ముందు ఇమ్రాన్ వాగ్ధానాలు చేశారు. కానీ అవేవీ జ‌ర‌గ‌క‌పోవ‌డంతో ప్ర‌జ‌లు అస‌హ‌నంతో ఉన్నారు. ఇమ్రాన్ వ్యాఖ్య‌ల ప‌ట్ల ఓ వ్య‌క్తి త‌న ట్వీట్‌లో ప్ర‌శ్నిస్తూ.. మ‌నం ఏమైనా శీతాకాలంలో ర‌ష్యాపై యుద్ధానికి వెళ్తున్నామా అని చ‌మ‌త్క‌రించారు.

2561
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles