ఆ డబ్బంతా కట్టేస్తా.. కోర్టులోనూ ఇదే చెప్పాను!

Mon,December 10, 2018 03:43 PM

I will repay the loans has nothing to do with the extradition case says Vijay Mallya

లండన్: విజయ్ మాల్యాను భారత్‌కు అప్పగించాలా వద్దా అన్నదానిపై కాసేపట్లో యూకేలోని వెస్ట్‌మిన్‌స్టర్ కోర్టు కీలక తీర్పు చెప్పనుంది. ఈ నేపథ్యంలో సోమవారం మాల్యా కోర్టుకు వచ్చాడు. అక్కడున్న మీడియాతో మాట్లాడుతూ.. తాను బ్యాంకుల దగ్గర తీసుకున్న రుణాలు, ఉద్యోగులకు ఇవ్వాల్సిన జీతాలన్నింటినీ తిరిగి చెల్లిస్తానని స్పష్టం చేశాడు. ఈ అప్పగింత కేసు నడుస్తున్న కారణంగా తాను రుణాలు చెల్లిస్తానని చెప్పడం లేదని, ఈ కేసుతో దీనికి సంబంధం లేదని అతను చెప్పాడు. ఈ సెటిల్మెంట్ ఆఫర్‌ను తాను కోర్టులోనే చేశానని, అందువల్ల ఆ విషయంలో వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదని మాల్యా అన్నాడు. ఈ కేసు విచారణ జరగనున్న సందర్భంగా సీబీఐ జాయింట్ డైరెక్టర్ సాయి మనోహర్ ఆదివారమే లండన్‌కు వెళ్లారు. బ్యాంకుల దగ్గర రూ.9 వేల కోట్లు రుణంగా తీసుకున్న మాల్యా.. వాటిని చెల్లించకుండా లండన్ పారిపోయిన సంగతి తెలిసిందే. అతన్ని తిరిగి భారత్‌కు అప్పగించాలని సీబీఐ లండన్ కోర్టులో పిటిషన్ వేసింది. ప్రస్తుతం దానిపైనే విచారణ జరుగుతున్నది.2372
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles