కశ్మీరే సమస్య.. కూర్చొని మాట్లాడుకుందాం: ఇమ్రాన్‌ఖాన్

Thu,July 26, 2018 06:25 PM

I want better ties with India says PTI Chief Imran Khan after his party takes lead in Pakistan Elections

ఇస్లామాబాద్: పాకిస్థాన్ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా పాకిస్థాన్ తెహ్రీకె ఇన్సాఫ్ నిలవడంతో ఆ పార్టీ అధినేత, కాబోయే ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కశ్మీర్ అంశాన్ని ఆయన లేవనెత్తారు. ఇండియా, పాకిస్థాన్ కచ్చితంగా కశ్మీర్ అంశాన్ని చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి. ఇలా ఒకరిపై మరొకరు నిందలు వేసుకుంటూ వెళ్తే కుదరదు. ఇండియాతో సత్సంబంధాల కోసం మేం సిద్ధంగా ఉన్నాం. మీరు అడుగు ముందుకు వేయండి.. మేం కూడా రెండడుగులు వేస్తాం అని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. అయితే కశ్మీర్‌లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతున్నదంటూ మరోసారి ఆరోపణలు గుప్పించారు. పౌర సమాజంలోకి ఆర్మీ ప్రవేశిస్తే అది మానవ హక్కుల ఉల్లంఘనే అవుతుంది అని ఇమ్రాన్ అభిప్రాయపడ్డారు.

ఇండియా, పాకిస్థాన్ మధ్య ఉన్న సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించాలని నేను అనుకుంటున్నా. రెండు దేశాల మధ్య ప్రధానాంశం కశ్మీరే. క్రికెట్ కారణంగానే నేను ఇండియాతో మంచి సంబంధాలు కోరుకుంటున్నాను. ఇండియన్ మీడియా నన్ను బాలీవుడ్ విలన్‌లా చిత్రీకరించడం బాధ కలిగించింది అని ఇమ్రాన్ అన్నారు. 22 ఏళ్లు పడిన శ్రమకు ఇప్పుడు ఫలితం దక్కింది. ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెబుతున్నాను. జిన్నా కలలు కన్న పాకిస్థాన్‌ను నిర్మిస్తాను అని ఇమ్రాన్‌ఖాన్ స్పష్టంచేశారు.

2961
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles