న్యూజిలాండ్ మ‌సీదుల‌నే ఎందుకు టార్గెట్ చేశానంటే ?

Fri,March 15, 2019 01:10 PM

I only wish I could have killed more invaders, says Christchurch gunman Brenton

హైద‌రాబాద్: బ్రెంట‌న్ ట‌రెంట్‌. న్యూజిలాండ్‌లో మ‌సీదుల‌పై కాల్పులు జ‌రిపిన ఉన్మాది ఇత‌నే. ఇత‌నిది ఆస్ట్రేలియా. మ‌రి న్యూజిలాండ్‌లో మ‌సీదును ఎందుకు టార్గెట్ చేశాడో తెలుసా. ఆ విష‌యాన్ని ఇత‌నే వివ‌రించాడు. ఆన్‌లైన్‌లో సుమారు 73 పేజీల త‌న వివ‌ర‌ణ‌ను పోస్టు చేశాడు. తానో సాధార‌ణ శ్వేత‌జాతీయుడిని అని చెబుతూనే.. ఇస్లాం మ‌త‌స్థులు ప్రార్థ‌న‌లు చేసే మ‌సీదుల‌ను ఎందుకు టార్గెట్ చేయాల్సి వ‌చ్చిందో వివ‌రించాడు. బ్రెంట‌న్ ఓ సాధార‌ణ వ‌ర్కింగ్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టాడు. కానీ త‌న దేశ ప్ర‌జ‌ల భ‌విష్య‌త్తు కోసం ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు చెప్పాడు. యురోపియ‌న్ దేశాల్లోకి ముస్లింల వ‌ల‌స‌ల‌ను ఆపేందుకే బ్రెంట‌న్ ఇలా దాడికి పాల్ప‌డిన‌ట్లు తెలుస్తోంది. ఇవాళ న్యూజిలాండ్‌లోని మ‌సీదుల‌పై జ‌రిగిన కాల్పుల ఘ‌ట‌న‌లో 40 మంది మృతిచెందారు.

ఆస్ట్రేలియా ప్ర‌ధాని స్కాట్ మారిస‌న్ కూడా బ్రెంట‌న్ అరెస్టును దృవీక‌రించారు. అత‌నో తీవ్రవాది, అతివాది, హింసాత్మ‌క ఉగ్ర‌వాది అని అన్నారు. అయితే త‌న ట్విట్ట‌ర్ అకౌంట్‌లో బ్రెంట‌న్‌.. 2016లో బాస్టిల్ డే రోజున ఫ్రాన్స్‌లోని నీస్‌లో జ‌రిగిన ఉగ్ర‌దాడికి సంబంధించిన ఫోటోను పోస్టు చేశాడు. ఆ రోజు జ‌రిగిన ట్ర‌క్కు దాడిలో 84 మంది మృతిచెందారు. త‌మ నేల‌ను ఎవ‌రూ ఆక్ర‌మించ‌లేర‌న్న సంకేతాన్ని ఇచ్చేందుకు బ్రెంట‌న్ ఈ దాడికి పాల్ప‌డ్డాడు. శ్వేత‌జాతీయులు ప్రాణాల‌తో ఉన్నంత వ‌ర‌కు ఎవ‌రూ ఈ నేల‌ను తాక‌లేర‌న్న సందేశాన్ని బ్రెంట‌న్ వినిపించాల‌నుకున్నాడు.

గ‌త రెండు ఏళ్ల నుంచి మ‌సీదుపై దాడికి ప్లానేసిన‌ట్లు బ్రెంట‌న్ త‌న పోస్టులో చెప్పాడు. కానీ క్రైస్ట్‌చ‌ర్చ్‌లో ఆ దాడి చేయాల‌ని కేవ‌లం మూడు నెల‌ల క్రిత‌మే ప్లానేశాడ‌ట‌. ఎందుకంటే, న్యూజిలాండ్‌లో ఉన్న వాతావ‌ర‌ణం అచ్చం యూరోప్ దేశాల‌ను త‌ల‌పిస్తుంద‌ని అత‌ను అన్నాడు. న్యూజిలాండ్‌లోని మ‌సీదుల‌పై దాడి చేస్తేనే త‌మ నాగ‌రిక‌త‌పై జ‌రుగుతున్న దాడి ప్ర‌పంచ దేశాల‌కు తెలుస్తుంద‌ని బ్రెంట‌న్ త‌న సందేశంలో చెప్పాడు. శ్వేత‌జాతి చిన్నారుల భ‌విష్య‌త్తు కోసం, ల‌క్ష‌లాది యురోపియ‌న్ల కోసం తాను ఈ దాడికి దిగిన‌ట్లు చెప్పాడు. యురోప్ నేల‌పై దురాక్ర‌మ‌ణ ద్వారా వేలాది మంది మ‌ర‌ణాల‌కు కార‌ణ‌మైన వారిపై ప్ర‌తీకారంతోనే ఈ చ‌ర్య‌ల‌కు దిగిన‌ట్లు చెప్పాడు. 2017లో స్టాక్‌హోమ్‌లో ఉగ్ర‌వాది కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన 11 ఏళ్ల చిన్నారి ఎబ్బా మృతికి ప్ర‌తీకారంగానూ ఈ దాడి చేసిన‌ట్లు తెలిపాడు.

ఫ్రాన్స్‌లో శ్వేతవ‌ర్ణం కాని వారు ఎక్కువ‌గా వ‌స్తున్నార‌ని గ్ర‌హించాన‌ని, దాని కోసం 2017లో అక్క‌డ టూర్ చేశాన‌ని, అది నిజ‌మ‌ని త‌ర్వాత తెలుసుకున్నాన‌ని, ఆ దేశంలో ప్ర‌తి ప‌ట్ట‌ణం, ప్ర‌తి వీధిలోనూ వాళ్లు ఉన్న‌ట్లు గుర్తించాన‌న్నాడు. త‌న చిన్న‌త‌నం కూడా సాదాసీదాగా సాగింద‌ని, స్కూల్ విద్య కూడా మామూలుగానే సాగింద‌న్నాడు. త‌న సంపాద‌న అంతా బిట్‌కాయిన్‌లో పెట్టుబ‌డి పెట్టిన‌ట్లు చెప్పాడు. మ‌సీదుల‌పై దాడి చేయ‌డం ప‌ట్ల త‌న‌కు ఏమాత్రం ప‌శ్చాతాపం లేద‌న్నాడు. మ‌రింత మంది ఆక్ర‌మ‌ణ‌దారుల‌ను, మ‌రింత మంది దేశ‌ద్రోహుల‌ను చంపితే బాగుండేద‌న్నాడు. ఒక‌వేళ ప్రాణాల‌తో పోలీసుల‌కు చిక్కినా.. కోర్టు ముందు మాత్రం నేరాన్ని అంగీక‌రిస్తాన‌న్నాడు. వ‌ల్‌హ‌ల్లా నినాదంతో త‌న పోస్టును క్లోజ్ చేశాడు.

8616
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles