మ‌ళ్లీ మీడియాపై విరుచుకుప‌డ్డ ట్రంప్‌Fri,February 17, 2017 01:35 PM
మ‌ళ్లీ మీడియాపై విరుచుకుప‌డ్డ ట్రంప్‌

వాషింగ్ట‌న్: అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ మ‌ళ్లీ మీడియాపై ఫైర‌య్యారు. త‌మ ప్ర‌భుత్వ ప‌రిపాల‌నా నిర్వ‌హ‌ణ‌లో ఎటువంటి ఆందోళ‌న లేద‌న్నారు. త‌మ ప్ర‌భుత్వం ఓ మేలైన మెషీన్‌లా న‌డుస్తోంద‌న్నారు. కార్మిక శాఖ మంత్రిగా అలెగ్జాండ‌ర్ అకోస్టాను నామినేట్ చేసిన ట్రంప్ ఆ సంద‌ర్భంగా వైట్‌హౌజ్‌లో మీడియాతో స‌మావేశం అయ్యారు. అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల స‌మ‌యంలో ర‌ష్యాతో సంబంధాలు కొన‌సాగించిన‌ట్లు వ‌స్తున్న ఆరోప‌ణ‌ల‌ను ఆయ‌న కొట్టిపారేశారు. నెల రోజుల త‌న ప్ర‌భుత్వ పాల‌న‌ను ట్రంప్ స‌మ‌ర్థించుకున్నారు. మీడియా వ్య‌వ‌హార‌శైలి స‌రిగా లేద‌ని, ఇంత‌టి నిజాయితీ లేని మీడియాను ఎప్పుడూ చూడ‌లేద‌ని, మ‌రీ ముఖ్యంగా పొలిటిక‌ల్ మీడియా చాలా దిగ‌జారిపోయింద‌ని విమ‌ర్శించారు. బాధ్య‌త‌ల‌న్నీ నెత్తిమీద వేసుకున్నాన‌ని కూడా అస‌హ‌నాన్ని వ్య‌క్తం చేశారు.

ఎన్నిక‌ల స‌మ‌యంలో ర‌ష్యాతో ర‌హ‌స్యంగా మాట్లాడార‌న్న ఆరోప‌ణ‌లు రావ‌డంతో జాతీయ భ‌ద్ర‌తా స‌ల‌హాదారుడు మైఖేల్ ఫ్లిన్ ఇటీవ‌ల రాజీనామా చేశారు. ఈ అంశంపై ప్రెస్ కాన్ఫ‌రెన్స్‌లో ట్రంప్ మాట్లాడుతూ సీరియ‌స్ అయ్యారు. లీకులు నిజ‌మే, నూరు శాతం నిజ‌మే, ఎందుకంటే వార్త‌ల‌న్నీ ఫేక్ న్యూసే అని విమ‌ర్శించారు. ఒబామా కేర్‌ను మార్చేందుకు కూడా మార్చి నెల‌లో కొత్త ప్ర‌ణాళిక‌ను ప్ర‌క‌టించ‌నున్న‌ట్లు ఆయ‌న చెప్పారు. ట్రంప్ అధికారం చేప‌ట్టి నెల రోజులు అవుతున్న‌ది. ట్రావెల్ బ్యాన్ అంశంపై ఆయ‌న‌కు కోర్టులో చుక్కెదురైంది. అటార్నీ జ‌న‌రల్‌ను తొలిగించారు. భ‌ద్ర‌తా స‌ల‌హాదారుడు రాజీనామా చేశారు. అయినా త‌న‌కు ప్ర‌భుత్వంపైన పూర్తి క‌మాండ్ ఉంద‌న్న‌ట్లు ట్రంప్ ప్రెస్‌కాన్ఫ‌రెన్స్‌లో వ్య‌వ‌హ‌రించారు.

2441
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS