కెనడాలో హువావెయ్ సంస్థ అధికారి అరెస్టు

Thu,December 6, 2018 06:42 PM

huwawei cfo arrested in canada

చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్స్ కంపెనీ హువావెయ్ అధికారి మెంగ్ వాంగ్‌జౌను కెనడాలో అరెస్టు చేశారు. సెల్‌పోన్లు, టీవిల వంటి ఉపకరణాల తయారీలో పేరెన్నిక గన్న హువావెయ్‌కి ఆమె గ్లోబల్ చీఫ్ పైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్‌వో)గా ఉన్నారు. అమెరికా విజ్ఞప్తి మేరకు కెనడా ఈ అరెస్టుకు పాల్పడినట్టు తెలుస్తున్నది. ఇరాన్‌పై విధించిన ఆంక్షలను హువావెయ్ ఉల్లంఘించిదని, ఆ కేసులో విచారణ నిమిత్తం ఆమెను అరెస్టు చేయలని అమెరికా కోరిందని అంటున్నారు. వాంకూవర్‌లో గత శనివారం ఆమెను అరెస్టు చేశారు. ఆమెను కెనడా అమెరికాకు అప్పగించనున్నది. అమెరికా ఎగుమతి నిబంధనలను ఉల్లంఘించి హువావెయ్ అమెరికాలో తయారైన ఉత్పత్తులను ఇరాన్ తదితర నిషేధిత దేశాలకు సరఫరా చేసిందని ఆరోపణలున్నాయి. కాగా హువావెయ్ వ్యవస్థాపకుడు రెన్ జెంగ్‌ఫెయ్ కుమార్తె అయిన వాంగ్‌జౌను తక్షణమే విడుదల చేయాలని చైనా డిమాండ్ చేసింది. అమెరికా, చైనా మధ్య నడుస్తున్న వాణిజ్య తగాదా ఈ అరెస్టుతో మరింత ముదిరే ప్రమాదముందని పరిశీలకులు భావిస్తున్నారు. అరెస్టుకు దారితీసిన పరిస్థితులను వివరించాలని, తక్షణమే ఆమెను విడుదల చేయాలని చైనా విదేశాంగశాఖ ప్రతినిధి జెంగ్ షువాంగ్ డిమాండ్ చేశారు. కాగా మెంగ్‌జౌను అరెస్టు చేశామని కెనడా న్యాయసాఖ ధ్రువీకరించింది. అయితే ఆమె కోరిక మేరకు మిగతా వివరాలు వెల్లడించేందుకు నిరాకరించింది.

1859
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles