సముద్రం ముందు నిలబడి ఫోటోకు పోజిచ్చిన‌ యువతి.. భారీ అలలు వచ్చి.. వీడియో

Wed,March 20, 2019 02:54 PM

Huge Wave Sweeps Away Tourist in Indonesian island

సముద్రం చాలా డేంజర్. మనం ఏం చేసినా సముద్రం ముందు నిలబడే. అది కూడా జాగ్రత్తగా గమనించాలి. ఒక్కోసారి భారీ అలలు వచ్చి సముద్రం బయట ఉన్నవాళ్లను కూడా లోపలికి లాక్కెళ్తాయి. అందుకే సముద్రం దగ్గరికి వెళ్లినప్పుడు కాస్త ఆలోచించాలి. అక్కడ ఆవేశపడితే ప్రాణాలకే ప్రమాదం.

ఇలాంటి ఘటనే ఒకటి ఇండోనేషియాలోని నుసా లెంబోన్గాన్ అనే ఐలాండ్‌లో ఉన్న డెవిల్స్ టియర్ వద్ద చోటు చేసుకున్నది. ఓ యువతి సముద్ర పక్కన ఉన్న కొండ మీదికి వెళ్లి ఫోటోకు పోజిచ్చింది. ఇంతలోనే రాకాసి అల వచ్చి తనను ఢీకొట్టింది. దీంతో ఆ యువతి అమాంతం ఎగిరి పడిపోయింది. భారీ అలలకు ఆ యువతి ఎక్కడ పడిపోయిందా అని అంతా ఒకేసారి అరిచారు. అయితే.. ఆ యవతి చిన్న గాయాలతో బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. డెవిల్స్ టియర్ అనేది ఇండోనేషియాలో బెస్ట్ టూరిస్ట్ స్పాట్. చాలామంది టూరిస్టులు అక్కడికి రోజూ వస్తుంటారు. అక్కడి అందాలను తమ కెమెరాల్లో బంధిస్తుంటారు. ఫోటోలకు పోజులిస్తుంటారు. అయితే.. భారీ అలలు వచ్చినప్పుడు మాత్రం టూరిస్టులు ఆ అలలకు దూరంగా పరిగెడతారు. ఈ యువతి భారీ అలను గమనించకపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

7539
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles