మొసలిని గుటుక్కున మింగేసిన కొండచిలువ.. వైరల్ ఫోటోలు

Sat,July 13, 2019 05:43 PM

Huge Python Swallowed Crocodile pics go viral

కరెంట్ తీగ కూడా నాలాగే సన్నగా ఉంటది. కానీ ముట్టుకుంటే.. షాకే.. అన్నట్టుగా ఈ కొండ చిలువ చూడటానికి సన్నగానే ఉన్నా అది ఏకంగా ఓ మొసలినే గుటుక్కున మింగేసింది. ఈ ఘటన ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్‌లో చోటు చేసుకున్నది.

ఆ కొండ చిలువ మామూలు గీమూలు కొండ చిలువ కాదట. దాన్ని ఆలివ్ పైథాన్ అంటారట. ఆస్ట్రేలియాలోని పొడవైన పాముల్లో రెండోదట.

కొలను వద్ద సేద తీరుతున్న మొసలిని కనిపెట్టిన ఆ కొండచిలువ.. దాని దగ్గరికి వెళ్లి లటక్కున పట్టేసుకొని మింగేసింది. నిజానికి కొండ చిలువల నోరు చూడటానికి చిన్నగానే ఉన్నా.. వాటి ద‌వ‌డ‌ల‌కు సాగే గుణం ఉంటుంది. దీని వల్ల వాటికన్నా పెద్ద జంతువులను కూడా లటక్కున మింగేయగలవు అవి. ఒక్కోసారి మనుషులను కూడా లాగించేస్తాయి. ఇక.. ఈ ఆలివ్ పైథాన్‌లు.. 13 అడుగుల పొడవు వరకు పెరుగుతాయట.

ఇక.. కొండచిలువ.. మొసలిని తినేస్తుండగా..మార్టిన్ ముల్లర్ అనే వ్యక్తి ఫోటోలు తీయగా.. వాటిని ఆస్ట్రేలియాకు చెందిన ఓ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ జీజీ వైల్డ్ లైఫ్ రెస్క్యూ.. తమ ఫేస్‌బుక్ ఖాతాలో షేర్ చేయడంతో ఆ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట్లో హల్‌చల్ చేస్తున్నాయి.


24465
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles