ఆస్పత్రి కాంప్లెక్స్‌లో అగ్నిప్రమాదం..మహిళ మృతి

Thu,August 22, 2019 06:16 PM

Huge fire in Paris hospital One dead, several injured


పారిస్‌: పారిస్‌లోని ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దక్షిణ క్రెటీల్‌ ప్రాంతంలో హెన్రీ-మొండర్‌ ఆస్పత్రి ప్రాంగణంలో సిబ్బంది నివసించే రెసిడెన్షియల్‌ కాంప్లెక్స్‌లో నుంచి హఠాత్తుగా మంటలు చెలరేగాయి. మంటలు పదంతస్తుల బిల్డింగ్‌లోని మిగతా అంతస్తుల్లోకి కూడా వ్యాపించాయి. ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందగా..పలువురికి గాయాలయ్యాయి. రెస్యూ టీం గాయాలైన వారిని ఆస్పత్రికి తరలించింది. ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. అదృష్టవశాత్తు మంటలు ఆస్పత్రిలోకి వ్యాపించలేదని పారిస్‌ ఫైర్‌ సర్వీసెస్‌ ప్రతినిధి గిల్లావుమీ ప్రెస్సె తెలిపారు.
1740
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles