స్టార్ హోటల్‌లో టాయిలెట్లు, తాగే గ్లాసులు ఒకే టవల్‌తో క్లీనింగ్: వీడియో వైరల్

Sat,November 17, 2018 05:50 PM

hotel staff cleaning toilets and drinking glasses with same towel

బీజింగ్: స్టార్ హోటళ్లలో సదుపాయాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అక్కడ లభించే అన్ని వసతులు అత్యుత్తమంగా ఉంటాయని అందరూ నమ్ముతారు. వారు అందించే సేవలు, క్వాలిటీ, ముఖ్యంగా పరిశుభ్రత, నాణ్యత ప్రమాణాలు నిబంధనలకు అనుగుణంగా ఉంటాయని ఆశిస్తాం. కానీ, కొన్ని లగ్జరీ హోటళ్లలో పనిచేసే సిబ్బంది ఏమాత్రం శుభ్రత పాటించట్లేదు. స్వచ్ఛత గురించి ఏమాత్రం అవగాహన లేదు.

చైనాలోని విలాసవంతమైన హోటల్‌లో టాయిలెట్లను, మంచినీళ్లు తాగే గ్లాసులను తుడవడానికి ఒకే టవల్‌ను ఉపయోగించారు. రెండింటిని శుభ్రం చేసేందుకు వారు ఒకే తువ్వాలను వాడటం అక్కడున్న సీసీటీవీలో రికాైర్డెంది. తాజాగా దీనికి సంబంధించిన వీడియోను ఒక బ్లాగర్ చైనాలో ఎంతో ప్రాచుర్యం పొందిన సోషల్‌మీడియా వెబ్‌సైట్ వైబోలో పోస్ట్ చేయడంతో ప్రపంచవ్యాప్తంగా వైరల్‌గా మారింది. దీంతో దేశవ్యాప్తంగా అన్ని హోటళ్లలో నాసిరకం ప్రమాణాలు పాటిస్తున్న వాటిపై చైనా టూరిజం అధికారులు దర్యాప్తునకు ఆదేశించారు. ఇప్పుడు ఈ వీడియోను చూస్తుంటేనే ఎంతో ఇబ్బందికరంగా ఉందని.. ఇక మనకు కనబడని, తెలియని విషయాలు ఇంకెన్ని జరుగుతున్నాయో ఊహించుకుంటేనే భయంగా ఉందని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


6027
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles