అట్టుడుకుతున్న హాంగ్‌కాంగ్‌.. నిర‌స‌న‌కారుల‌పై ర‌బ్బ‌ర్ బుల్లెట్లు

Wed,June 12, 2019 05:53 PM

Hong Kong protests over China extradition bill

హైద‌రాబాద్: హాంగ్‌కాంగ్‌లో నిర‌స‌న జ్వాల‌లు వెల్లువెత్తుతున్నాయి. ఆందోళ‌న‌ల‌తో అట్టుడుకుతోంది. నేర‌స్తుల అప్ప‌గింత చ‌ట్టం(ఎక్స్‌ట్ర‌డిష‌న్ లా)కు వ్య‌తిరేకంగా హాంగ్ కాంగ్ ప్ర‌జ‌లు ఉద్య‌మించారు. ఇవాళ హాంగ్‌కాంగ్ వీధుల్లో భారీ ప్ర‌ద‌ర్శ‌న చేప‌ట్టారు. వివాదాస్ప‌ద బిల్లుకు వ్య‌తిరేకంగా ఆందోళ‌న‌కారులు ర్యాలీలు తీశారు. అయితే నిర‌స‌న‌కారుల‌పై పోలీసులు టియ‌ర్ గ్యాస్ ప్ర‌యోగించారు. ర‌బ్బ‌ర్ బుల్లెట్లు ఫైర్ చేశారు.



నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌నను పోలీసులు అల్ల‌ర్ల ఘ‌ట‌న‌గా చిత్రీక‌రించారు. ఒక‌వేళ బిల్లు ఓకే అయితే.. దాని ప్రకారం ప్ర‌జాస్వామ్య కార్య‌క‌ర్త‌లు, జ‌ర్న‌లిస్టు, విదేశీ వ్యాపార‌వేత్త‌లను చైనాకు అప్ప‌గించాల్సి ఉంటుంది. మ‌రోవైపు హాంగ్‌కాంగ్ లెజిస్టేటివ్ కౌన్సిల్ వివాదాస్ప‌ద బిల్లుపై చ‌ర్చ‌ల‌ను వాయిదా వేసింది. లెజిస్టేటివ్ కౌన్సిల్ నుంచి ఆందోళ‌న‌కారుల‌ను పోలీసులు త‌రిమారు. అయితే నిర‌స‌న‌కారులంగా ప్ర‌స్తుతం ఓ బిల్డింగ్‌లో త‌ల‌దాచుకున్నారు. ప‌సిఫిక్ ప్లేస్ షాపింగ్ సెంట‌ర్‌లో కొన్ని వంద‌ల మంది ఆశ్ర‌యం తీసుకున్నారు.

1180
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles