నేర‌స్తుల‌ అప్ప‌గింత బిల్లును ఉప‌సంహ‌రించిన హాంగ్‌కాంగ్‌

Wed,October 23, 2019 01:24 PM

హైద‌రాబాద్‌: హాంగ్‌కాంగ్‌లో నిర‌స‌న‌ల‌కు కార‌ణ‌మైన వివాదాస్ప‌ద నేర‌స్తుల అప్ప‌గింత బిల్లును ఆ దేశ ప్ర‌భుత్వం ర‌ద్దు చేసింది. వివాదాస్ప‌ద బిల్లును ప్ర‌భుత్వం ఇవాళ‌ అధికారికంగా ఉప‌సంహ‌రించిన‌ట్లు స్థానిక మీడియా పేర్కొన్న‌ది. గ‌త కొన్ని నెల‌లుగా హాంగ్‌కాంగ్‌లో భారీ స్థాయిలో ఆందోళ‌న‌లు చోటుచేసుకున్న విష‌యం తెలిసిందే. నేర‌స్తుల‌ను చైనాకు అప్ప‌గించాలంటూ కొన్ని నెల‌ల క్రితం హాంగ్‌కాంగ్ ఓ బిల్లును రూపొందించింది. దాన్ని వ్య‌తిరేకిస్తూ ఆందోళ‌న‌లు మిన్నంటాయి. ఆ స‌మ‌యంలో ప్ర‌భుత్వ కార్యాల‌యాల‌ను నిర‌స‌న‌కారులు చుట్టుముట్టారు. అయితే బిల్లును ఉప‌సంహ‌రించేందుకు ప్ర‌య‌త్నాలు చేయ‌నున్న‌ట్లు ఇటీవ‌ల ఆ దేశ నేత క్యారీ లామ్ పేర్కొన్న‌దారు.


మ‌ర్డ‌ర్ నిందితుడు రిలీజ్‌
2018లో హాంగ్‌కాంగ్‌కు చెందిన చాన్ టాంగ్ కాయి అనే వ్య‌క్తి త‌న ప్రెగ్నెంట్ గ‌ర్ల్‌ఫ్రెండ్‌ను హ‌త్య చేశాడు. ఆ కేసులో తైవాన్‌.. చాన్ టాంగ్‌ను అప్ప‌గించాల‌ని డిమాండ్ చేసింది. ఈ ఘ‌ట‌న‌తోనే అప్ప‌గింత బిల్లుకు వ్య‌తిరేకంగా హాంగ్‌కాంగ్‌లో భారీ స్థాయిలో ఉద్య‌మం మొద‌లైంది. డిపోర్ట్ చేయాల‌నుకున్న ఆ అనుమానితున్ని ఇవాళ రిలీజ్ చేశారు. మ‌ర్డ‌ర్ కేసులో న్యాయ‌విచార‌ణ ఎదుర్కొనేందుకు నిందితుడు సిద్ధంగానే ఉన్నా.. ప్ర‌స్తుతం అత‌న్ని హాంగ్‌కాంగ్‌లోనే ఉంచారు. ఈ కేసులో అత‌ను 18 నెల‌ల పాటు జైలులోనే ఉన్నాడు. గ‌ర్ల్‌ఫ్రెండ్‌ను హ‌త్య చేసి ఆమె ద‌గ్గ‌ర ఉన్న డ‌బ్బు, ఇత‌ర విలువైన వ‌స్తువుల‌ను అత‌ను ఎత్తుకెళ్లాడు. అయితే ప్రియురాలిని హ‌త్య చేసిన ఘ‌ట‌న ప‌ట్ల అత‌ను ప‌శ్చాతాపం కూడా వ్య‌క్తం చేశాడు. స‌రెండ‌ర్ కావాల‌నుకున్నాడు. కానీ హాంగ్ కాంగ్ మాత్రం ఇవాళ అత‌న్ని రిలీజ్ చేసింది.

599
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles