ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరం ఏదో తెలుసా?

Tue,June 26, 2018 05:30 PM

Hong Kong is the costliest city in the World reveals latest survey

లండన్: ఈ కాలంలో మెట్రో నగరాల్లో బతకడం చాలా ఖర్చుతో కూడుకున్న పనైపోయింది. మధ్య తరగతి వాళ్లకు నగరాలు నరకం చూపిస్తున్నాయి. ఇలా ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరాలపై ప్రతి ఏటా సర్వే నిర్వహిస్తారు. అలా ఈసారి నిర్వహించిన సర్వే ప్రకారం ఇండియాలో అత్యంత ఖరీదైన నగరంగా ముంబై నిలవడం విశేషం. గ్లోబల్ లిస్ట్‌లో ముంబై 55వ స్థానంలో నిలిచింది. ఈ క్రమంలో ప్రపంచస్థాయి నగరాలైన మెల్‌బోర్న్ (58), ఫ్రాంక్‌ఫర్ట్ (68), బ్యూనస్ ఎయిర్స్ (76), స్టాక్‌హోమ్ (89), అట్లాంటా (95) నగరాల కన్నా ముందు ఉండటం మరో విశేషం.

మిగతా నగరాల విషయానికి వస్తే ఢిల్లీ 108, చెనై 144, బెంగళూరు 170, కోల్‌కతా 182వ స్థానాల్లో నిలిచాయి. ఆహార పదార్థాలు, ఆల్కహాల్, ఇతర గృహోపకరణ వస్తువుల ధరలు భారీగా పెరగడంతో కొన్ని ప్రపంచ స్థాయి నగరాల కంటే కూడా ముంబై ఖరీదైనదిగా మారిందని ఈ సర్వే తేల్చింది. ఇక ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరంగా హాంకాంగ్ నిలిచింది. ఈ నగరం తర్వాత టోక్యో(2), సింగపూర్ (4), సియోల్ (5), షాంఘై (7), బీజింగ్ (9) నిలిచాయి. ప్రతి ఏటా మెర్సర్ అనే సంస్థ ఈ సర్వే నిర్వహిస్తుంది. దీనిని బట్టే ఉద్యోగులకు జీతభత్యాలను ఎలా ఇవ్వాలో ప్రముఖ కంపెనీలు నిర్ణయిస్తాయి.

4428
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS