స్కూల్ అమ్మాయిలకు.. 900 వాలెంటైన్ పువ్వులిచ్చాడు..

Sat,February 13, 2016 01:19 PM

High school senior hands out 900 flowers to girls at school

ఉటాహ్ : అమెరికాలో ఓ విద్యార్థి వెరైటీగా గర్ల్స్‌ను ఇంప్రెస్ చేశాడు. తాను చుదువుకుంటున్న స్కూళ్లో ఉన్న అమ్మాయిలకు వాలెంటైన్ డే శుభాకాంక్షలు హార్ట్ టచ్ అయ్యేలా చెప్పాడు. ఒక్కరిద్దరు కాదు, స్కూళ్లో ఉన్న 843 మంది అమ్మాయిలకు ఫ్లవర్స్ ఇచ్చాడు. అమెరికా రాష్ట్రంలోని ఉటాహ్ రాష్ట్రంలోని స్మిత్‌ఫీల్డ్‌లో 17 ఏళ్ల హేడన్ గాడ్‌ఫ్రే ఈ సర్‌ప్రైజ్ చేశాడు.

స్కై వ్యూహ్ హై స్కూల్‌లో చదువుతున్న హేడన్ ప్రేమికుల దినోత్సవం రోజున ప్రతి అమ్మాయిని సంతోష పెట్టాలనుకున్నాడు. దానికి తగ్గట్టుగానే ప్లానేశాడు. వాలెంటైన్ డేకు మూడు రోజుల ముందే మొత్తం 900 ఫ్లవర్స్‌తో స్కూల్‌కు వచ్చాడు. ఆ స్కూళ్లో ఉన్న అమ్మాయిలందరికీ రోజా పువ్వులను పంచిపెట్టి వాలెంటైన్ డే శుభాకాంక్షలు చెప్పాడు. ఇదంతా చేసేందుకు ఫ్రెండ్స్ హెల్ప్ కూడా తీసుకున్నాడు.

దాదాపు 20 రోజుల ముందే ఆన్‌లైన్‌లో పువ్వల కోసం గాడ్‌ఫ్రే ఆర్డర్ చేశాడు. ఆ తర్వాత తన ఫ్రెండ్స్‌తో వాటిని గిఫ్ట్‌లుగా మలిచాడు. గురువారం ఆ పువ్వులను ట్రక్కులో తరలించి స్కూళ్లో ఉన్న అమ్మాయిలందిరికీ వాలెంటైన్ ప్రజెంటేషన్‌గా ఇచ్చేశాడు. గాడ్‌ఫ్రే లవ్ స్ట్రాక్ స్కూల్ అమ్మాయిలను థ్రిల్ చేసింది. వాళ్లను కాదు, అమ్మాయిల పేరంట్స్ కూడా ఆ స్టంట్‌కు ముగ్దులయ్యారు. ఇక గాడ్‌ఫ్రేపై ట్వీట్ల వర్షం కురుస్తోంది.

అమ్మాయిలను ఆకట్టుకునేందుకు గాడ్‌ఫ్రే ఒంటరి వాడేమి కాదు. అతని లవర్ కూడా అదే స్కూల్. భాయ్‌ఫ్రెండ్ చేష్టలకు 18 ఏళ్ల లిల్లీయాన్ షార్ప్ అసూయ పడలేదు. తన పార్ట్నర్ మంచి పని చేశాడని ఆమె సంతోషం వ్యక్తం చేసింది. వాలెంటైన్ రోజున ప్రతి అమ్మాయి ముఖంలో చిరునవ్వును తీసుకొచ్చిన తన లవర్ గ్రేట్ అని ఫీలవుతోంది. ఎందుకంటే, ప్రేమికుల రోజు ఒక్క గిఫ్ట్ కూడా రాకుంటే అమ్మాయి మనస్సు ఎలా ఉంటుందో తనకు తెలుసట.

2696
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS