తలకాయ లేకున్నా వారం రోజులు బతికిన కోడి!

Thu,March 29, 2018 06:15 PM

Hen survives without head for a week after being decapitated in Thailand

ఈ భూమ్మీద నుకలుంటే ఎటువంటి సునామీలు, భూకంపాలు, తుఫానులు వచ్చినా బతికి బట్టకడతామంటారు పెద్దలు. సేమ్ టూ సేమ్ ఇటువంటి ఘటనే ఒకటి ఎదురైంది ఓ కోడికి. ఆ కోడికి ఈ భూమ్మీద కొన్ని రోజులు ఇంకా నూకలున్నాయో ఏమో కాని.. ఆ నూకలు తినడానికి నోరు మాత్రం లేకుండా పోయింది. ఓ కోడి తల లేకుండా ఓ వారం పాటు ప్రాణాలతో నిలవడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఈ ఘటన థాయిలాండ్‌లో చోటు చేసుకున్నది.

అయితే.. దాని తలను ఎవరు కోశారో.. లేదంటే ఏదైనా జంతువు దానిపై అటాక్ చేసి తలను చిద్రం చేసిందో తెలియదు కాని.. తల లేకున్నా.. రక్తం బొట్లు కింద పడుతున్నా.. ఒంట్లో రక్తం చుక్కల రూపంలో బయటికి పోతున్నా చావుకు ఏమాత్రం బెదరలేదు. తుది శ్వాస వరకు పోరాడి ఓడిపోయింది ఆ కోడి. ఇక.. ఈ కోడిని గమనించిన స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినప్పటికీ.. దాని ప్రాణాలు మాత్రం కాపాడలేకపోయారు. ఇక.. దాని ఫోటోను తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఆ తలలేని కోడి ఫోటోలు వైరల్‌గా మారడంతో నెటిజన్లు దాని తెగింపు, దైర్యం, బతకాలనే ఆశను తెగ మెచ్చుకుంటున్నారు.

8049
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS