భారీగా కురుస్తున్న మంచు.. స్తంభించిన యూరోప్‌

Fri,January 11, 2019 05:28 PM

Heavy snow fall in Europe, Arctic conditions prevail across continent

బెర్లిన్: యూరోప్ దేశాలు గ‌జ‌గ‌జ వ‌ణుకుతున్నాయి. అన్ని దేశాల్లోనూ ఇప్పుడు ఆర్కిటిక్ వాతావ‌ర‌ణ ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. విప‌రీత వాతావ‌ర‌ణ ప‌రిస్థితుల‌ (బీస్ట్ ఫ్ర‌మ్ ద ఈస్ట్) వ‌ల్ల చాలా వ‌ర‌కు యూరోప్ దేశాల్లో భారీ స్థాయిలో మంచు కురుస్తోంది. ఆస్ట్రియాలోని ఆల్ప్స్ ప‌ర్వ‌తాలు మంచుతో నిండిపోయాయి. అక్క‌డ ఆర్మీ ప్ర‌త్యేకంగా స‌హాయ చ‌ర్య‌ల్లో నిమ‌గ్న‌మైంది. విపరీత‌మైన మంచు వ‌ల్ల కొన్ని ప్రాంతాల్లో స్కీయింగ్‌ను నిలిపేశారు. వింట‌ర్ వెద‌ర్ త‌ట్టుకోలేని స్థితిలో ఉంద‌ని జ‌ర్మ‌నీ అధికారులు చెబుతున్నారు. అనేక ప్రాంతాల్లో కురుస్తున్న మంచు వ‌ల్ల ఎక్క‌డిక్క‌డ ట్రాఫిక్ స్తంభించిపోయింది. స్కూళ్ల‌ను మూసివేశారు. నార్వేలోనూ వింట‌ర్ స్టార్మ్స్ ద‌డ‌ద‌డ పుట్టిస్తున్నాయి. ఓ విమానాశ్ర‌యాన్ని మూసి వేసి ఫ్ల‌యిట్ల‌ను ర‌ద్దు చేశారు. సెర్బియా, గ్రీస్‌లోనూ శీతాకాల చ‌ల‌లు చంపేస్తున్నాయి. మ‌రికొన్ని రోజుల పాటు వెద‌ర్ ఇలాగే ఉంటుంద‌ని వాతావ‌ర‌ణ‌శాఖ అధికారులు హెచ్చ‌రిస్తున్నారు.

1070
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles