కారును పార్క్ చేసిన చోటు మ‌రిచిపోయాడు..!

Fri,November 17, 2017 04:36 PM

He forgot where he parked his car after 20 years it was found

మతిమరుపు బహువిధాలు అన్నట్లు... కొంతమంది మతిమరుపు వల్ల ఎన్నో అనర్థాలు జరుగుతాయనడానికి ఈ ఘటనే ఉదాహరణ. ఈ విచిత్ర ఘటన జర్మనీలో జరిగింది. ఓ వ్యక్తి 20 ఏండ్ల కింద అంటే 1997లో తన కారును ఓ చోట పార్క్ చేశాడు. తర్వాత తన కారును ఎక్కడ పార్క్ చేశాడో మరిచిపోయాడు. కారును ఎవరైనా ఎత్తుకెళ్లారేమో అనుకొని పోలీస్ కంప్లయింట్ కూడా ఇచ్చాడు. కాని.. కారు మాత్రం దొరకలేదు.

ఇక ఆ విషయాన్నే పూర్తిగా మరిచిపోయాడు ఆ వ్యక్తి. సరిగ్గా 20 ఏండ్ల తర్వాత అంటే ఇప్పుడు గ్యారేజీలో ఉన్న ఆ కారును ఫ్రాంక్‌ఫ‌ర్ట్‌ అధికారులు గుర్తించారు. గ్యారేజీ బిల్డింగ్‌ను కూలగొట్టడానికి గ్యారేజీని చెక్ చేస్తున్న సమయంలో వాళ్లకు ఈ కారు కనిపించింది. దీంతో కారు నెంబర్ అధారంగా ఆ కారు ఓనర్‌ను గుర్తించిన అధికారులు.. ఆయనకు సమాచారం అందించడంతో 20 ఏండ్ల క్రితం అక్కడ ఆ కారును పార్క్ చేసిన విషయాన్ని గుర్తుకు తెచ్చుకున్నాడు. అయితే.. 20 ఏండ్లుగా ఆ కారు అక్కడే పడి ఉండటంతో తుప్పు పట్టి పనికిరాకుండా మరిపోయింది. దీంతో చేసేదేమిలేక.. దాన్ని చెత్తకుప్పకు తరలించారు అధికారులు. చూశారుగా... మతిమరుపు ఎంత పని చేసిందో.

8936
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS