పాక్ ఎన్నికలు.. పోటీలో లేని హఫీజ్ సయీద్

Sat,June 9, 2018 11:19 AM

Hafiz Saeed not in fray, JuD to run for over 200 seats in Pak general elections

ఇస్లామాబాద్: అంతరాజతీయ ఉగ్రవాది, పాకిస్థాన్‌లోని జమాత్ ఉద్ దవా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్.. ఆ దేశం పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. ఈ ఏడాది జూలై 25వ తేదీన పాక్‌లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. అయితే ముంబై పేలుళ్లలో ప్రధాన సూత్రధారిగా ఉన్న హఫీజ్ సయీద్ మాత్రం ఆ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని తెలిసింది. జమాత్ ఉద్ దవా నేత హఫీజ్.. ఇటీవలే మిల్లీ ముస్లిం లీగ్ అనే రాజకీయ పార్టీని స్థాపించారు. కానీ ఇంత వరకు ఆ పార్టీ పాక్ ఎలక్షన్ కమీషన్ దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకోలేదు. అయితే జనరల్ ఎలక్షన్స్ దగ్గరపడుతున్న నేపథ్యంలో ఆ పార్టీ అభ్యర్థులు.. అల్లాహూ అక్బర్ తెహ్రీక్(ఏఏటీ) పార్టీ తరపున పోటీ చేయాలనుకుంటున్నారు. ఏఏటీ పార్టీ పేరు మీద హఫీజ్ టీమ్ ఎన్నికల్లో పోటీ చేస్తోందని జమాత్ నేతలు తెలిపారు. దేశవ్యాప్తంగా సుమారు 200 మంది హఫీజ్ మద్దతుదారులు ఎన్నికల్లో పోటీ చేసేందుకు దరఖాస్తు చేసుకున్నారు. ఎంఎంఎల్ పార్టీలో చేరిన వారికి ఏఏటీ పార్టీ టికెట్లు ఇచ్చినట్లు తెలుస్తోంది.

1222
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles