పాక్ ఎన్నికలు.. ఓటేసిన హఫీజ్ సయీద్

Wed,July 25, 2018 12:01 PM

Hafiz Saeed casts his vote at a polling booth in Lahore

లాహోర్ : పాకిస్థాన్ పార్లమెంట్, నాలుగు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. లాహోర్‌లోని ఓ పోలింగ్ బూత్‌లో లష్కరే తోయిబా చీఫ్, 26/11 ముంబై పేలుళ్ల సూత్రధారి హఫీజ్ సయీద్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆవామీ ముస్లిం లీగ్ లీడర్ షేక్ రషీద్ కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా షేక్ రషీద్ మాట్లాడుతూ.. పాక్ ఎన్నికల్లో తాము చారిత్రాత్మక విజయం సాధిస్తామని చెప్పారు. ఈ రోజు రాత్రికి రావాల్పిండి ప్రజలకు కృతజ్ఞతలు చెప్తామని ఆయన పేర్కొన్నారు. ఫైసలాబాద్‌లో పాకిస్థాన్ ముస్లిం లీగ్ నాయకుడు అబిద్ షేర్ అలీ ప్రిసైడింగ్ అధికారితో గొడవ పెట్టుకున్నారు.
పార్లమెంట్‌లోని 272 స్థానాలకు 3,459 మంది అభ్యర్థులు పోటీపడుతుండగా.. 4 రాష్ర్టాల అసెంబ్లీలోని 577 స్థానాలకు 8,396 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. పాకిస్థాన్ తెహ్రీక్ ఇన్సాఫ్, పాకిస్థాన్ ముస్లిం లీగ్‌కు మధ్య హోరాహోరి పోటీ ఉంటుందని సర్వేలు వెల్లడించాయి.


2255
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles