హఫీజ్ సయీద్ బావమరిది అరెస్ట్

Wed,May 15, 2019 04:35 PM

Hafiz Saeed Brother in Law Abdul Rehman Arrested in Pakistan


లాహోర్: ముంబై ఉగ్రదాడి మాస్టర్‌మైండ్, జమాత్-ఉద్-దావా చీఫ్ హఫీజ్ సయీద్ బావమరిది అబ్దుల్ రహమాన్ మక్కీని పాక్ పోలీసులు అరెస్ట్ చేశారు. పాకిస్థాన్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ విద్వేపూరితంగా ప్రసంగించినందుకు పాక్‌స్థాన్ పోలీసులు అబ్దుల్ రహమాన్ మక్కీని అదుపులోకి తీసుకున్నారు. జమాత్-ఉద్-దావా రాజకీయ, అంతర్జాతీయ వ్యవహారాల శాఖకు అబ్దుల్ రహమాన్ మక్కీ అధిపతిగా ఉండటంతోపాటు ఫలా-యీ-ఇన్సానియత్ ఫౌండేషన్ (ఎఫ్‌ఐఎఫ్)కు ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తున్నారు.

మక్కీని పబ్లిక్ ఆర్డర్ యాక్ట్ నిర్వహణ కింద అరెస్ట్ చేసినట్లు పంజాబ్ పోలీసులు తెలిపారు. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్ (ఎఫ్‌ఏటీఎఫ్) మార్గదర్శకాల ప్రకారం పాక్ ప్రభుత్వం తీసుకున్న చర్యలను అణచివేయడంలో భాగంగా విమర్శలు చేయడంతో మక్కీని అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

927
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles