విక్ట‌రీ ర్యాలీలో కాల్పులు.. న‌లుగురికి గాయాలు

Tue,June 18, 2019 10:44 AM

GUNSHOTS FIRED AT RAPTORS CHAMPIONSHIP PARADE IN TORONTO

హైద‌రాబాద్: కెన‌డాలోని టొరంటోలో కాల్ప‌ల ఘ‌ట‌న చోటుచేసుకున్న‌ది. బాస్కెట్‌బాల్ టోర్నీలో టొరంటో రాప్ట‌ర్స్ విజేతగా నిలిచింది. అయితే ఆ జ‌ట్టు నిర్వ‌హించిన విక్ట‌రీ ప‌రేడ్‌లో కాల్పుల ఘ‌ట‌న జ‌రిగింది. నాథ‌న్ పిలిప్స్ స్క్వేర్ వ‌ద్ద జ‌రిగిన ప‌రేడ్‌లో పాల్గొనేందుకు వేల సంఖ్య‌లో క్రీడాభిమానులు వ‌చ్చారు. అయితే అక్క‌డ కాల్పులు శ‌బ్ధాలు వినప‌డ‌డంతో జ‌నం ప‌రుగులు తీశారు. ఆ ఘ‌ట‌న‌లో న‌లుగురు గాయ‌ప‌డ్డారు. వారికి ప్రాణాపాయం లేద‌ని తెలిసింది. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి ముగ్గుర్ని అరెస్టు చేశారు. సంఘ‌ట‌నా స్థలం నుంచి రెండు పిస్తోళ్ల‌ను సీజ్ చేశారు.

657
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles