లైవ్‌లో.. 17 నిమిషాల పాటు కాల్పుల వీడియో

Fri,March 15, 2019 12:09 PM

Gunman livestreamed 17 minutes of shooting terror

క్రైస్ట్‌చ‌ర్చ్: న్యూజిలాండ్‌లోని క్రైస్ట్‌చ‌ర్చ్‌లో ఓ ఉన్మాది ఘాతుకానికి పాల్ప‌డ్డాడు. మ‌సీదు వ‌ద్ద కాల్పులకు పాల్ప‌డిన అత‌ను .. త‌న యాక్ష‌న్ మొత్తాన్ని లైవ్‌స్ట్రీమ్ చేశాడు. మొత్తం 17 నిమిషాల పాటు షూటింగ్‌ను లైవ్ చేశాడు. కాల్పులు జ‌రిపిన ఉన్మాదిని 28 ఏళ్ల బ్రెంట‌న్ టారంట్‌గా గుర్తించాడు. అత‌నిది ఆస్ట్రేలియా. బ్రెంట‌న్ ట్విట్ట‌ర్ అకౌంట్‌ను ఆస్ట్రేలియా బ్లాక్ చేసింది. కాల్పులు జ‌రిపిన ఘ‌ట‌న గురించి సుమారు 17 నిమిషాల లైవ్ వీడియోను అత‌ను ఆన్‌లైన్‌లో పోస్టు చేశాడు. అయితే ఆ వీడియో న్యూజిలాండ్ మీడియా వ‌ద్ద ఉన్న‌ది. కానీ దాన్ని ఆన్‌లైన్ నుంచి తొల‌గించారు. సోష‌ల్ మీడియాలో ఉన్న షూటింగ్ వీడియోను కూడా డిలీట్ చేసే విధంగా చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు పోలీసు క‌మీష‌న్ మైక్ బుష్ తెలిపారు. షూటింగ్ వీడియోను ఫేస్‌బుక్ నుంచి డిలీట్ చేశామ‌ని ఇప్ప‌టికే ఆ సంస్థ వెల్ల‌డించింది. షూట‌ర్ బ్రెంట‌న్‌కు చెందిన ఎఫ్‌బీ, ఇన్‌స్టా అకౌంట్ల‌ను వెంట‌నే క్లోజ్ చేశారు. మ‌సీదు కాల్పుల్లో 40 మంది మృతి చెందారు.

1635
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles