ఆ సిటీలో ఎక్కడ చూసినా సాలీడు గూళ్లే.. వైరల్ ఫోటోలు

Fri,September 21, 2018 03:26 PM

Greek Town Infested With Spiders, Covered In Giant Webs

కొన్ని రోజులు ఇంటిని శుభ్రం చేయకుంటేనే సాలీడులు(సాలెపురుగులు) ఇళ్లు మొత్తం గూడు కట్టేస్తాయి. ఇళ్లంతా బూజు బూజే. పాతబడిపోయిన ఇంటి గురించయితే చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కడ చూసినా సాలీడు గూళ్లే ఉంటాయి. ఇదంతా సహజం. కానీ.. ఓ అసహజం ఇప్పుడు మీకు చెప్పాలి. అదేంటంటే.. సాలీడులు ఓ సిటీనే ఆక్రమించేశాయి. అక్కడ ఎక్కడ చూసినా సాలీడు గూళ్లే కనిపిస్తాయి. విచిత్రంగా ఉందా? షాకయ్యారా? ఇంకా ఉంది చదవండి.

ఆ సిటీ పేరు ఐటిలికో. గ్రీక్ టౌన్. హార్రర్ సినిమాలో చూపించినట్టుగా ఉంటుంది ఆ ప్రాంతమంతా. ఎక్కడ చూసినా ఈ సాలీడు గూళ్లే కనిపిస్తాయి. ఐటిలికోకు లిటిల్ వెనిస్ అనే పేరు కూడా ఉందట. కానీ.. ఈ సాలీడుల వల్ల ఇప్పుడా పేరు కాస్త మారి స్పైడర్ వెబ్ విలేజ్‌గా మారిపోయింది. ఆ సాలీడు గూళ్లకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

టెట్రాగ్నత అనే జాతికి చెందిన ఈ సాలీడులు నీళ్లలోనూ సులువుగా నడవగలవట. చూడటానికి చాలా చిన్నగా, తేలికగా ఉంటాయట ఇవి. భూమ్మీద కూడా వేగంగా పరిగెత్తగలవు. అయితే.. వీటి వల్ల మానవ జాతికి ఎటువంటి ముప్పు లేనప్పటికీ.. ఇలా గూళ్లతో మాత్రం అవి ఉన్న ప్రాంతాన్ని నింపేస్తాయి.

అసలు.. వేల సంఖ్యలో ఈ జాతికి చెందిన సాలీడులు ఇక్కడే ఎందుకు తిష్టేశాయబ్బా అనే డౌట్ మీకు రావచ్చు. దానికి ఓ కారణం ఉంది. ఆ ప్రాంతంలో గ్నాట్స్ అనే కీటకాలు ఎక్కువగా ఉంటాయట. గ్నాట్స్ అంటే ఏంటో అనుకునేరు. మన దగ్గర దోమలు.. అక్కడ గ్నాట్స్ అంటారు. అవో రకం దోమలు అన్నమాట. ఆ కీటకాలంటే సాలీడులకు చాలా ఇష్టమట. మనకు బిర్యానీలాగ. అందుకే ఆ గ్నాట్స్ కీటకాలు అక్కడ వృద్ధి చెందుతున్నా కొద్దీ వాటిని తింటూ ఈ సాలీడు జాతి కూడా అంతకంతకూ వృద్ధి చెందుతున్నది. కానీ.. గ్నాట్స్ జాతి అంతరించి పోతే ఆ సాలీడు జాతి కూడా అంతరించిపోతుందని బయాలజిస్టులు చెబుతున్నారు.1797
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles