లాస్‌ఏంజెల్స్‌లో కాల్పుల కలకలం

Sun,July 22, 2018 09:41 PM

Grandmother shot hostages held at supermarket 1 woman dead

లాస్‌ఏంజెల్స్ : అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చెలరేగింది. లాస్‌ఏంజెల్స్‌లో ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల్లో ఒక వృద్ధురాలు అక్కడికక్కడే మృతిచెందగా, మరో యువతి గాయాలపాలైంది. అనంతరం ఆ దుండగుడు ట్రేడర్స్ జోయ్స్ సూపర్ మార్కెట్‌లోని పలువురిని బందీగా చేసుకొని బెదిరింపులకు దిగాడు. లాస్ ఏంజెస్స్‌లోని అత్యంత రద్దీగా ఉండే సిల్వర్ లేక్ ప్రాంతంలోని జోయ్స్ సూపర్ మార్కెట్ వద్ద సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకొందని లాస్‌ఏంజెల్స్ నగర మేయర్ ఎరిక్ గార్సెట్టీ ధ్రువీకరించారు.

దక్షిణ లాస్ ఏంజెల్స్‌లో ఇద్దరు మహిళలపై కాల్పులు జరుపడంతో ఓ వృద్ధురాలు అక్కడికక్కడే రక్తపుమడుగులో పడి చనిపోగా.. మరో యువతికి తీవ్రగాయాలయ్యాయి. అనంతరం దుండగుడు తన కారులో పరారయ్యాడు. అతడ్ని పట్టుకునేందుకు పోలీసులు సినిమా తరహా ఛేజ్ చేపట్టగా.. పలుమార్లు కాల్పులకు తెగబడ్డాడు. చివరకు జోయ్స్ సూపర్ మార్కెట్ లోపలికి చొరబడిన దుండగుడు అక్కడ ఉన్న దాదాపు 40 మందిని బందీలుగా చేసుకొన్నాడు. సూపర్ మార్కెట్‌ను చుట్టుముట్టి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

దాదాపు నాలుగు గంటల తర్వాత దుండుగుడని వ్యూహాత్మకంగా పోలీసులు అదుపులోకి తీసుకొని బందీలను విడిపించారు. చివరకు మృతురాలు కాల్పులు జరిపిన దుండుగుడికి నానమ్మ కాగా, గాయపడిన యువతి ప్రియురాలుగా పోలీసులు గుర్తించారు. గాయపడిన యువతిని చికిత్స నిమిత్తం దవాఖానకు తరలించామని, ప్రస్తుతం ఆమె పరిస్థితి మెరుగ్గా ఉన్నదని లాస్‌ఏంజెల్స్ పోలీసు అధికార ప్రతినిధి సార్జెంట్ బారీ మాంటిగోమేరి చెప్పారు. కాగా, కాల్పులకు తెగబడిన వ్యక్తి పేరు, వివరాలుగానీ, ఎందుకు కాల్పులు జరిపాడనేదిగానీ పోలీసులు వెల్లడించలేదు.

815
Follow us on : Facebook | Twitter
Namasthe Telangana Property Show

More News

VIRAL NEWS

Namasthe Telangana Property Show

Featured Articles