స్విట్జర్లాండ్ లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు

Mon,October 7, 2019 09:15 AM

జురిచ్: సద్దుల బతుకమ్మ పండుగను స్విట్జర్లాండ్ లోని తెలుగు వారు వైభవంగా జరుపు కున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి స్విట్జర్లాండ్ అధ్యక్ష ఉపాధ్యక్షులు శ్రీధర్ గందే మరియు అల్లు కృష్ణ రెడ్డి, తెలంగాణ జాగృతి అధ్యక్షులు కిషోర్ తాటికొండ మరియు జనరల్ సెక్రటరీ అనిల్ జాలల ఆధ్వర్యంలో స్విట్జర్లాండ్ లోని జురిచ్ నగరంలో సద్దుల బతుకమ్మ పండుగ ఉత్సాహంగా జరుపుకున్నారు. మొదటగా తెలంగాణ ఆడబిడ్డలు గుందే అనుపమ, రజని తాటికొండ, లావణ్య అల్లు, శిల్ప జాల, సినీతా ఫణి, పద్మజ ల ఆధ్వర్యంలో రంగు రంగుల పూలతో అద్భుతమైన బతుకమ్మలని పేర్చి గౌరమ్మని ప్రతిష్టించి భక్తి శ్రద్దలతో పూజించారు. బతుమ్మలతో ఉత్సవ ప్రాంగణానికి చేరుకొని
జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు.


ఈ ఉత్సవాలలో స్విట్జర్లాండ్ ప్రభుత్వ స్థానిక ప్రతినిధులు శ్రీ బార్బరా జిక మరియు మథియాస్ జిక కూడా పాల్గొని ఉత్సాహంగా బతుకమ్మ పాటలు పాడి ఆనందించారు. మాతృభూమికి దూరంగా ఉన్నా.. సంస్కృతి సంప్రదాయాలను పాటించడం గురించి వారు ఈ సందర్భంగా అభినందించారు. పండుగ వాతావరణాన్ని మరింత ఉత్సాహభరితం చేసేందుకు ఉత్సవాలలో NRI సింగర్ స్వాతి రెడ్డి (లండన్ ) పాల్గొని తన పాటలతో ఆహుతులను ఉర్రుతలూగించారు.


1852
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles